Mallika Sagar: WPL 2026 మొదటి మెగా వేలం నవంబర్ 27న న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో మొత్తం 277 మంది మహిళా ప్లేయర్స్ వేలానికి అందుబాటులో ఉండగా, వారిలో గరిష్టంగా 73 మంది అమ్ముడుపోతారని సమాచారం. ఈ మెగా వేలంలో ప్లేయర్స్‌కు మల్లికా సాగర్ వేలం నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన వేలంలో కూడా మల్లికనే వేలం నిర్వహించారు. WPL 2026 మెగా వేలంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఈ మల్లికా సాగర్ ఎవరు, ఆమె కథను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Mangli: మంగ్లీపై అసభ్యకర వ్యాఖ్యలు.. మేడిపల్లి స్టార్ అరెస్ట్..
మల్లికా సాగర్ ఎవరు?
మల్లికా సాగర్ (మల్లికా సాగర్ వేలం నిర్వాహకురాలు WPL) కళా ప్రపంచంలో సుప్రసిద్ధ వ్యక్తిగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఫిలడెల్ఫియాలోని బ్రైన్ మావర్ కళాశాలలో మల్లికా.. కళా చరిత్ర(పెయింటింగ్, శిల్పం, వాస్తుశిల్పం వంటివి) అభ్యసించారు. 2001లో 26 ఏళ్ల వయస్సులో మల్లికా తన కెరీర్‌ను వేలం సంస్థ క్రిస్టీస్‌లో ప్రారంభించింది. ఆమె ఈ సంస్థకు తొలి భారతీయ వేలం పాటదారుగా మారింది. ప్రస్తుతం ఆమెకు ఈ రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆమె IPL, WPL లలో వేలంపాటదారుగా ఉండటమే కాకుండా, గతంలో ప్రో కబడ్డీ లీగ్‌లో కూడా పనిచేసింది. ఆమె ప్రో కబడ్డీ లీగ్‌తో స్పోర్ట్స్ వేలంపాటదారుగా అరంగేట్రం చేశారు. ఆమె PKL 8వ సీజన్‌లో వేలంపాటదారుగా ఉంది.
WPL 2026 క్రీడాకారులను వేలం వేస్తున్న మల్లికా సాగర్ నికర విలువ సుమారు $15 మిలియన్లు లేదా దాదాపు ₹126 కోట్లని అంచనా. మల్లిక ముంబైలోని ఒక వ్యాపార కుటుంబం నుంచి వచ్చింది. ఆమె USAలోని ఫిలడెల్ఫియా బ్రైన్ మావర్ కళాశాలలో ఆర్ట్ హిస్టరీ చదివారు. హ్యూ ఎడ్మీడ్స్ ఆకస్మిక అనారోగ్యం తర్వాత 2023లో IPL వేలంలో పాల్గొన్నప్పుడు ఆమెకు తొలిసారిగా గుర్తింపు వచ్చింది. ఈ రంగంలో ఆమె విశ్వాసం అందరి హృదయాలను గెలుచుకుంది. BCCI ఆమెను 2024 నుంచి IPL ఫుల్ టైం వేలంపాటదారుగా నియమించింది. ఆమె WPL గత సీజన్‌లో కూడా వేలంపాటదారుగా పనిచేశారు.
READ ALSO: Rishabh Pant: సారీ చెప్పిన రిషబ్ పంత్.. ఎందుకో తెలుసా!
What is it like to run the show at a #TATAWPL Mega Auction? 🤔
🎥 Hear it from auctioneer Mallika Sagar as she gears up for another #TATAWPLAuction 🙌 – By @mihirlee_58
Follow the TATA WPL Mega Auction 2026 LIVE today on https://t.co/jP2vYAWukG 💻 pic.twitter.com/Ad1kEHXZ6I
— Women's Premier League (WPL) (@wplt20) November 27, 2025