Sankrantiki Vastunnam : బుల్లి రాజా కోసమైనా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకు పోవాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankrantiki Vastunnam : ఈ సారి టాలీవుడ్ సంక్రాంతి సందడి పెద్దగా లేదనే చెప్పాలి. కేవలం మూడు సినిమాలు మాత్రమే సంక్రాంతి బరిలో నిల్చున్నాయి. ఈ తెలుగు సినిమాల సందడి ముగిసింది. జనవరి 10న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కాగా, జనవరి 12న నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలు వచ్చాయి. జనవరి 14న విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రిలీజ్ అయ్యింది. లేటుగా వచ్చినా ముందు వచ్చిన రెండు సినిమాల కంటే బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ సంక్రాంతి 2025 విన్నర్‌గా నిలిచింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా. ఈ సినిమా రిలీజ్‌కి ముందే అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్స్ బోర్డులు పెట్టారు. రిలీజ్ తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా టాక్ రావడంతో జనవరి 15న కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి మంచి బుకింగ్స్ వచ్చాయి. సాధారణంగా వెంకీ నటించే సినిమాల్లో అటెన్షన్ అంతా తనకే దక్కుతుంది.
Read Also:Manchu Manoj: మోహన్‌బాబు వర్సిటీకి మంచు మనోజ్.. MBU దగ్గర టెన్షన్, టెన్షన్..!
Also Read
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
‘F2’ మూవీలో యంగ్ హీరో వరుణ్ తేజ్‌ని పూర్తిగా డామినేట్ చేశాడు వెంకీ మామ.. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మాత్రం వెంకటేశ్ కొడుకు ‘బుల్లిరాజా’గా నటించిన బుడ్డోడు ఫస్టాఫ్‌లో పూర్తిగా డామినేట్ చేశాడు. బుల్లిరాజా సీన్లకు థియేటర్లలో నవ్వుల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఎవరీ బుల్లిరాజా.. బుల్లి రాజుగా నటించిన కుర్రాడి పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తర్వాత ఈ బుడ్డోడు, టాలీవుడ్‌లో భారీగా అవకాశాలు దక్కించుకోవడం ఖాయం. మాస్టర్ భరత్ తర్వాత నవ్వించే చైల్డ్ ఆర్టిస్ట్‌లు పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు రేవంత్, అప్పటి భరత్ ప్లేస్‌ని రిప్లేస్ చేయగల బుల్లి కమెడియన్‌గా కనిపిస్తున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వెంకీకి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి, తన తర్వాత సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు. ఈ సినిమాలో కూడా బుల్లి రాజు రేవంత్‌కి కూడా ఓ మంచి పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
-
Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
-
Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!