Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakalaka Shankar: ఉత్తరాంధ్ర మట్టి నుంచి పుట్టి, బుర్రకథతో యావత్ తెలుగు నేలను ఉర్రూతలూగించిన జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఆనంది ప్రధాన పాత్ర పోషించగా, గౌరీ నాయుడు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అనూహ్యమైన, అత్యంత భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై ప్రసంగిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనైన ప్రముఖ నటుడు, కమెడియన్ షకలక శంకర్.. అక్కడే కూర్చుని ఉన్న ఒరిజినల్ గరివిడి లక్ష్మి కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆమెకు పాదాభివందనం చేస్తూ షకలక శంకర్ కన్నీటిపర్యంతమవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణం మొత్తం భావోద్వేగంతో నిండిపోయింది.
ఈ సందర్భంగా షకలక శంకర్ మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి గారి డ్యాన్స్ తర్వాత నేను మళ్లీ అంతటి మూమెంట్స్, ఎనర్జీ చూసింది కేవలం మా గరివిడి లక్ష్మమ్మ డ్యాన్స్‌లోనే. 80లు, 90లలో చిరంజీవి గారు వేసిన స్టెప్పులనే ఆవిడ తన చీరకట్టుతో, కాళ్లకు గజ్జె కట్టి అలవోకగా వేసేశారు. నిజమైన డ్యాన్స్, స్వచ్ఛమైన జానపద కళ అంటే ఏంటో నేర్చుకోవాలంటే యూట్యూబ్‌లో లక్ష్మమ్మ బుర్రకథలు చూడాలి” అంటూ కొనియాడారు. కళాకారులను బతికించడానికే ఆ తల్లి ఇంకా మన మధ్య బతికి ఉందని, తెలుగు ప్రేక్షకులు ఉన్నంతవరకు ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెబుతూ.. “మా కళాకారులందరినీ ఆశీర్వదించు తల్లీ” అంటూ నేరుగా వెళ్లి ఆమె పాదాలకు నమస్కరించారు.
Also Read
- Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
- Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
- Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
బుర్రకథ, జానపద కళాకారులను ప్రజలు మర్చిపోతున్న ప్రస్తుత కాలంలో.. ఇలాంటి మట్టి కథను తెరపైకి తెచ్చిన నిర్మాతలు విశ్వప్రసాద్, కృతి ప్రసాద్‌ల ధైర్యాన్ని శంకర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. దర్శకుడు గౌరీ నాయుడు ఎక్కడా రాజీపడకుండా కథను తీర్చిదిద్దారని, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ బుర్రకథ ఆత్మ దెబ్బతినకుండా అద్భుతమైన పాటలు అందించారని తెలిపారు. ఈ సినిమాలో కేజీఎఫ్, సలార్ ఫేమ్ అనన్య భట్, దర్శకుడు గౌరీ నాయుడులతో కలిసి తాను కూడా పాటలు పాడిన విషయాన్ని ఆయన పంచుకున్నారు. ఉత్తరాంధ్ర జీవనశైలిని, ఒక గొప్ప కళాకారిణి కన్నీటి ప్రయాణాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ‘గరివిడి లక్ష్మి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఎమోషనల్‌గా ఆదరిస్తుండగా, వేదికపై ఒరిజినల్ కళాకారిణి పాదాలను తాకి శకలక శంకర్ చూపిన గౌరవం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!