Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- గురుగ్రామ్‌లో సంచలనంగా ఐటీ దంపతుల మరణం..
- ‘లోకాన్ని విడిచి వెళ్తున్నాం’ అంటూ నోట్..
- భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurugram Techie Couple: హర్యాలోని గురుగ్రామ్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఐటీ ఉద్యోగులైన భార్యభర్తలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. భార్య ఫర్హానాను హత్య చేసి, భర్త మొహమ్మద్ అస్లాం ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనకు ముందు అస్లాం తన యజమానికి ‘‘మేము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాము’’ అని ఈమెయిల్ పంపించాడు.
కేరళకు చెందిన అస్సాం(30), ఆయన భార్య ఫర్హానాలు గురుగ్రామ్‌లో ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. మూడు నెలల క్రితం బెంగళూర్ నుంచి గురుగ్రామ్ వచ్చి, M3M మెరీనా రెసిడెన్షియల్ సొసైటీలో అద్దెకు ఉంటున్నారు. బుధవారం భార్య ఫర్హానా పుట్టినరోజు నాడే ఈ సంఘటన జరిగింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభించింది. అస్లాం ఉరి వేసుకున్న స్థితిలో కనిపించగా, ఫర్హానా మృతదేహం నెలపై పడి ఉంది. ఆమె మెడపై గాయాలు ఉన్నాయి. ఫర్హానా దుస్తులపై ‘‘ఐలవ్ యూ’’ అని రాసి ఉంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్లో ‘‘మేము ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్తున్నాము’’ అని రాసి ఉంది.
Also Read
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ఘటనా స్థలం నుంచి మూడు ల్యాప్‌లాప్‌లు, రెండు మొబైల్ ఫోన్లు, తాడు, డైరీ, కత్తెర, పెన్ డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఘటనకు దారి తీసిన పరిస్థితుల్ని కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అస్లాం గతేడాదిన్నరగా డిప్రెషన్ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్యభర్తల మధ్య విబేధాలు లేవని చెప్పారు. ఈ ఘటనకు పని ఒత్తిడి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!