White House Official TikTok Account: అమెరికా వైట్ హౌస్ మంగళవారం అధికారికంగా టిక్‌టాక్ అకౌంట్ ప్రారంభించింది. చైనాకు చెందిన బైట్‌డాన్స్ యాజమాన్యంలో ఉన్న ఈ ప్లాట్‌ఫామ్‌ను అమెరికాలో నిషేధించే లేదా అమ్మకానికి పెట్టే దిశలో ఉన్నప్పటికీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని కొనసాగించేందుకు అనుమతిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా.. “అమెరికా.. మేము తిరిగి వచ్చాం! వాట్స్ అప్ టిక్‌టాక్?” అనే క్యాప్షన్‌తో 27 సెకన్ల వీడియోను వైట్ హౌస్ మొదటి పోస్టుగా విడుదల చేసింది. అకౌంట్ ప్రారంభం తర్వాత ఒక గంటలో దాదాపు 4,500 ఫాలోవర్లు చేరారు. ఇది ఇలా ఉండగా ట్రంప్ వ్యక్తిగత టిక్‌టాక్ అకౌంట్‌కు 110.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆయన చివరిసారి నవంబర్ 5, 2024 ఎన్నికల రోజున ఇందులో పోస్ట్ చేశారు.
Samsung TV Plus: ఈటీవీ, శాంసంగ్ భాగస్వామ్యం.. శాంసంగ్ టీవీ ప్లస్‌లో ఈటీవీ ఛానెల్స్!
టిక్‌టాక్‌కి సంబంధించిన చట్టం ప్రకారం, జాతీయ భద్రతా కారణాల వల్ల దీనిని అమెరికాలో అమ్మకానికి పెట్టకపోతే నిషేధించాలి. ఆ చట్టం జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ట్రంప్ ఆ నిషేధాన్ని నిలిపివేశారు. అలాగే జూన్ మధ్యలో ట్రంప్ టిక్‌టాక్‌కు మరో 90 రోజుల గడువు ఇచ్చారు. ఈ గడువు ప్రకారం సెప్టెంబర్ మధ్య నాటికి చైనేతర కొనుగోలుదారుని కనుగొనకపోతే టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం అమలు కానుంది.
HariHaraVeeraMallu : న్యూ వర్షన్ తో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న వీరమల్లు..
గతంలో ట్రంప్ టిక్‌టాక్ నిషేధానికి మద్దతు ఇచ్చినప్పటికీ, తరువాత తన వైఖరిని మార్చుకున్నారు. యువ ఓటర్ల మద్దతు పొందడంలో ఈ ప్లాట్‌ఫామ్ తనకు సహాయపడిందని నమ్ముతూ, దానిని రక్షించాలనే నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ వినియోగదారులు దాదాపు రెండు బిలియన్లు మంది ఉన్నారు. సోషల్ మీడియా ఫాలోవర్ల విషయంలో ట్రంప్‌కు X (ట్విట్టర్)లో 108.5 మిలియన్లు, ఆయన స్వంత ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్‌లో 10.6 మిలియన్లు ఫాలోవర్లు ఉన్నారు. ఇక వైట్ హౌస్ అధికారిక అకౌంట్లలో Xలో 2.4 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 9.3 మిలియన్లు ఫాలోవర్లు ఉన్నారు.