మరో వారం రోజుల్లో ఇండియాలో వరల్డ్ కప్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల జట్లు భారత్కు చేరుకోగా.. వార్మప్ మ్యాచ్లు నేటి నుంచి ప్రారంభించాయి. తొలిసారిగా వన్డే ప్రపంచకప్కు ఇండియా ఆతిథ్యమిస్తుండటం విశేషం. అయితే ఈసారి జరగబోయే వన్డే వరల్డ్ కప్లో ఏఏ జట్లు సెమీ ఫైనల్ కు చేరుతాయనే చర్చ కూడా మొదలైంది. కొందరు క్రికెట్ దిగ్గజాలు సెమీస్ కు వెళ్లే టీమ్లను తెలిపారు.