ప్రతివారం లాగే ఈ వారం కూడా సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ఒకటికాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.. గత కొన్నాళ్లుగా అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో పెద్దగా చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ అయితే రాలేదు. వచ్చినా కూడా ఒకటో, రెండో సినిమాలు వచ్చాయి.. కానీ ఇప్పుడు మాత్రం మూడు సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
గామి..
శివరాత్రి కానుకగా విడుదలైన విశ్వక్ సేన్ సూపర్ హిట్ మూవీ ఇది.. దాదాపు ఆరేళ్లపాటు షూటింగ్ చేసి మరీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్ అఘోరాగా నటించడం విశేషం. ఈ సినిమా అందరికీ బాగా నచ్చేసింది.. దిమ్మతిరిగే కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది..తెలుగుతో పాటు తమిళ, కన్నడ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి..
ఓం భీం బుష్..
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ అనే సినిమా కూడా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.. మూడు వారాల్లోనే ఓటీటీలోకి రావడం విశేషం.. థియేటర్లలో కామెడితో కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా ఓటీటీలో ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..
ప్రేమలు..
మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమలు లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 100 కోట్లు సాధించి రికార్డును అందుకుంది.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది…డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. దాంతో పాటు ఆహాలో కూడా డబ్బింగ్ సినిమా ప్రేమలు వస్తోంది..