Khaidi : కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన కార్తీ తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.కార్తీకి తమిళ్ తో పాటు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.కార్తీ తమిళ్ లో నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతూ మంచి కలెక్షన్స్ సాధిస్తాయి. ఇదిలా ఉంటే కార్తీ కెరీర్ లోప్రత్యేకమైన మూవీ “ఖైదీ”.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. 2019 అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
ఈ సినిమాలో హీరో కార్తీ ఢిల్లీ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో లోకేష్ స్క్రీన్ ప్లే అద్భుతమని చెప్పాలి. త్వరలోనే లోకేష్ కనగరాజ్ ఖైదీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే మే 25న కార్తీ పుట్టిన రోజు సందర్భంగా ఖైదీ చిత్రాన్ని హైదరాబాద్‌లో రిరీలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.
On the Occasion of @Karthi_offl Bday #Khaidi back in theatres from May25th (Hyderabad) 🔥@Dir_Lokesh @prabhu_sr pic.twitter.com/e19kSm4kDd
— Teju PRO (@Teju_PRO) May 16, 2024