WhatsApp Update: డాక్యుమెంట్ స్కాన్ ఫీచర్ అందుబాటులోకి తీసుకరాబోతున్న వాట్సాప్
- వాట్సాప్ మేసేజింగ్ ప్లాట్‌ఫామ్
- డాక్యుమెంట్ స్కాన్ ఫీచర్ అందుబాటులోకి
- పూర్తి వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp Document scanning Update: వాట్సాప్ మేసేజింగ్ ప్లాట్‌ఫామ్ తన వినియోగదారులకు కొత్త ఆప్షన్స్ ని అందించేందుకు తరచూ కొత్త అప్డేట్స్ ను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగానే, “డాక్యుమెంట్ స్కాన్” అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకరావడం ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్ కెమెరా సహాయంతో డాక్యుమెంట్స్‌ను నేరుగా స్కాన్ చేసి వాటిని తేలికగా షేర్ చేయవచ్చు. ముఖ్యంగా తరచూ డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేయాల్సిన లేదా పంపాల్సిన వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.
Also Read: Rohit Sharma: కెప్టెన్ కావడం వల్లే రోహిత్ ఇంకా ఆడుతున్నాడు: ఇర్ఫాన్
Also Read
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్‌తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్‌మ్యాన్’ గురి.!
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
ఈ ఫీచర్, వాట్సాప్ డాక్యుమెంట్ షేరింగ్ మెనూలో భాగంగా అందుబాటులో ఉంది. ఇది యూజర్లకు ఫోన్ కెమెరా ద్వారా ఫిజికల్ డాక్యుమెంట్స్‌ను నేరుగా స్కాన్ చేసి పంపించే సౌలభ్యం కల్పిస్తుంది. ఇప్పటి వరకు, డాక్యుమెంట్ ఫోటో తీసి, దానిని డాక్యుమెంట్ ఫార్మాట్లో మార్చి పంపాల్సి వచ్చేది. ఇది చాలా సమయం తీసుకోవడం తోపాటు ఫోటో నాణ్యత కూడా అంత బాగుండేది కాదు. కానీ ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌తో డాక్యుమెంట్స్‌ను నేరుగా స్కాన్ చేసి పంపడం ద్వారా సమయం కూడా ఆదా అవుతుంది. ఇంకా మరియు డాక్యుమెంట్ నాణ్యత మెరుగ్గానే ఉంటుంది.
ఈ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. క్రింది స్టెప్స్‌ని పాటించి మీరు సులభంగా డాక్యుమెంట్ స్కాన్ చేయవచ్చు:
* వాట్సాప్ ఓపెన్ చేసి, మీరు డాక్యుమెంట్ పంపాలనుకుంటున్న చాట్ లేదా గ్రూప్‌ను సెలెక్ట్ చేసుకోండి.
* అటాచ్మెంట్ ఐకాన్ పై టాప్ చేయండి.
* అక్కడ కనిపించే “డాక్యుమెంట్” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు “స్కాన్” ఆప్షన్‌పై టాప్ చేయండి.
* మీ కెమెరా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు స్కాన్ చేయాల్సిన డాక్యుమెంట్ ఫోటో తీసుకోండి.
* ఫోటో తీసుకున్న తర్వాత, మీరు స్కాన్‌ను చూడవచ్చు. కావాలనుకుంటే అంచులను సరిదిద్దుకోవచ్చు.
* అన్ని సరిగా అనిపించిన తర్వాత, “కన్ఫర్మ్” పై టాప్ చేయండి.
* స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఇప్పుడు పంపేందుకు సిద్ధంగా ఉంటుంది. “సెండ్” బటన్ పై టాప్ చేసి పంపించుకోవచ్చు.
Also Read: PSLV-c60: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ 60.. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలు!
ఈ కొత్త ఫీచర్‌తో, ఫోటో తీసి దానిని క్రాప్ చేయాల్సిన అవసరం ఉండదు. నేరుగా స్కాన్ చేసి పంపించవచ్చు. పైగా, స్కాన్ చేసిన డాక్యుమెంట్ నాణ్యత ఫోటోతో పోల్చితే చాలా మెరుగ్గా ఉంటుంది. వాట్సాప్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేవడంతో యూజర్లకు మరింత సౌలభ్యం కల్పించింది. తరచూ డాక్యుమెంట్స్ స్కాన్ చేయాల్సిన వారికి ఈ ఫీచర్ ఒక గొప్ప ఉపయుక్తమైన పరిష్కారం అవుతుంది.
తాజావార్తలు
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్‌లో రో-కో ఆడతారా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!