WhatsApp Channels New Feature: ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్ల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఛానెల్స్‌ను పరిచయం చేసిన వాట్సప్.. ప్రస్తుతం దాన్ని విస్తరించే దిశగా సాగుతోంది. ఛానెల్ ఓనర్‌షిప్‌ను మరొకరికి బదిలీ చేసే సదుపాయంను తాజాగా తీసుకొచ్చింది. వాట్సప్‌కు సంబంధించి అప్‌డేట్స్ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని పేర్కొంది.
వాట్సప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో ఛానెల్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఓనర్‌షిప్‌ను వేరొకరికి బదిలీ కూడా చేయొచ్చు. ప్రస్తుత ఛానెల్ యజమాని.. అర్హత ఉన్న వినియోగదారుల జాబితా నుంచి కొత్త యజమానిని ఎంచుకొని బదిలీ ప్రక్రియ ఆరంభించొచ్చు. కొత్త ఓనర్ బదిలీ అభ్యర్థనను ఓకే చేస్తే.. ఛానెల్ పూర్తి నిర్వాహణ హక్కులు పొందవచ్చు. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్ తమ ఛానెల్‌లపై మరింత నియంత్రణను కలిగి ఉంటారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.