Whats today updates 16.10.2022
1.నేడు తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. ఈ పరీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది.
2. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,400 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.60,500లుగా ఉంది.
3. నేడు హైదరాబాద్‌లో ఆరు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు. హైదరాబాద్-లింగంపల్లి మధ్య నడిచే 47108 నంబర రైలును ఉదయం 10.55 బదులు మధ్యాహ్నం 12.30 నడుపనున్నట్లు వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే.
4. నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరు సూర్యనారాయణ స్వామి ఆలయంలో, అర్చనలు,అభిషేకాలు, విశేష పూజలు.
5. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 10గంటల సమయం…
6. నంద్యాల సీఎం పర్యటనపై నేడు కలెక్టర్ సమావేశం. రేపు అల్లగడ్డకు రానున్న సీఎం జగన్.
7. శ్రీ సత్య సాయి జిల్లా అనంతపురంలో జరిగే అభిమాని కుమార్తె వివాహానికి హాజరు కానున్న ఎమ్మెల్యే బాలకృష్ణ. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం హిందూపురం పట్టణంలోని శాంతినగర్ RTC కాలనీ ,శ్రీ కంఠాపురం చెరువు ప్రాంతాలను పరిశీలించనున్న బాలయ్య.
8. 8వ టీ20 ప్రపంచకప్ నేటి నుంచి ( అక్టోబర్ 16) ఆస్ట్రేలియాలో ప్రారంభం కానుంది. 29 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 16 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి.