*నేడు మరోసారి తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన.. నారాయణపేట బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని.. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో పాల్గొననున్న మోడీ.
*నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్.. ఉదయం 10 గంటలకు మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జగన్ ఎన్నికల ప్రచార సభ.. మధ్యాహ్నం 12.30 గంటలకు నగరి నియోజకవర్గంలో కార్వేటి నగరం కాపు వీధి సర్కిల్లో సభ.. మధ్యాహ్నం 3 గంటలకు కడప లోక్‌సభ పరిధిలో మద్రాస్రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జగన్ సభ.
*నేడు ఐదు చోట్ల చంద్రబాబు ప్రజాగళం సభలు.. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలులో చంద్రబాబు సభలు.
*కాకినాడ: నేడు పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. రోడ్ షో, ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో పవన్ బహిరంగ సభ.
*తెలంగాణలో నేటితో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్.. సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం.
*నేటితో ముగియనున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర.. సాయంత్రం సిద్దిపేటలో రోడ్ షోలో పాల్గొననున్న బీఆర్ఎస్ అధినేత.. గత నెల 24న ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్ర.. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మే 1 న రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు ప్రచారంపై నిషేధం విధించిన ఈసీ.
*ఢిల్లీ: లిక్కర్ కేసులో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన కవిత.. కవిత పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ.
*తూర్పుగోదావరి జిల్లా: నేటి నుంచి గోదావరి డెల్టా సిస్టం పరిధిలో పంట కాలువలు మూసివేత.. రబీ పంటకు నీటి సరఫరా విడుదల నిలుపువేత.. చివరి స్థాయికి చేరిన మూడు ప్రధాన కాలువలైన తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల పరిధిలో వరిపంట , త్రాగునీటి అవసరాలు.. పంట కాలువల నీటి విడుదల ఈ సాయంత్రం 6.00 గంటలకు నిలుపుదల.. తిరిగి కాలువలకు జూన్ 10వ తేదీ నుండి నీటి విడుదల
*ఐపీఎల్: నేడు గుజరాత్ వర్సెస్ చెన్నై.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.