What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఖమ్మం: నేడు ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లిలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ పర్యటన.. ఖమ్మంలో మున్నేరుపై రూ. 180 కోట్లతో తీగెల వంతెన నిర్మాణానికి శంకుస్థాపన.. మున్నేరు వరద ముంపు నుంచి రక్షణ గోడల ఆర్సీసీ వాల్ కోసం రూ.690 కోట్లతో నిర్మాణానికి శంకుస్థాపన.. ఖమ్మంలో ప్రగతి నివేదన సభ
* భద్రాచలంలో నేడు కరకట్ట పొడిగింపునకు రూ. 38 కోట్లతో శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్.. సత్తుపల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్న కేటీఆర్
Also Read
* ప్రకాశం : త్రిపురాంతకం మండలం మేడపిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* ప్రకాశం : ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్ లో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధుల సమావేశం, హాజరుకానున్న పలువురు ముఖ్య నేతలు..
* తిరుమల: అక్టోబర్ 9వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం..
* తిరుమల: ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు సడలింపు.. రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు అనుమతి.. చిరుతల సంచారం కారణంగా రెండు నెలలుగా ద్విచక్ర వాహనాల అనుమతిపై ఆంక్షలు విధించిన టీటీడీ.. ఆరు చిరుతలను ట్రాప్ చెయ్యడం.. చిరుతల సంచారం తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు సడలింపు
* శ్రీకాకుళం: పలాస మండలం అల్లుఖోల గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం.. ప్రారంభించనున్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు..
* నెల్లూరు: ముత్తుకూరు మండలంలో పర్యటించనున్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్ నాయక్
* నెల్లూరులోని జిల్లా కోర్టులో న్యాయాధికారుల వర్క్ షాప్.. హాజరుకానున్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జయ సూర్య.. జస్టిస్ సుబ్బారెడ్డి
* నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ పరిధిలోని 10 గ్రామాల నేతలు కార్యకర్తలతో సమావేశం
* తూర్పుగోదావరి జిల్లా : 21వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఈ నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు
* తూర్పుగోదావరి జిల్లా : నేడు చంద్రబాబుకు మద్దతుగా రాత్రి 7 నుండి 5 నిమిషాలు పాటు మోత మోగిద్దాం అంటూ ఆందోళనకు టిడిపి శ్రేణులకు నారా బ్రాహ్మణి పిలుపు.. చంద్రబాబును అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం అంటూ నినాదాలు..
* అనంతపురం : నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష . జిల్లా వ్యాప్తంగా 34 చోట్ల వ్తెద్య శిబిరాలు ఏర్పాటు.
* విశాఖ: నేడు వాల్తేరు డివిజన్ పరిధిలో ప్రాజెక్టులపై సమీక్షించనున్న రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శనా జర్దోష్.. విశాఖ రైల్వేస్టేషన్‌లో రైల్ కోచ్ రెస్టారెంట్ ఓపెన్ చేయనున్న మంత్రి
* అనంతపురం : పెద్ద పప్పూరు మండలం జూటూరు గ్రామం నుండి తిమ్మనచెరువు వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి పాదయాత్ర.. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని జూటూరులోని ఆలయాలలో ప్రత్యేక పూజలు.
* విశాఖ: నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఉపాధ్యాయుల ధర్నా.. పెండింగ్ లో ఉన్న 31 సమస్యల పరిష్కారం కోసం నిరసనకు పిలుపునిచ్చిన ఏపీ టీఎఫ్
* అనంతపురం : గార్లదిన్నె మండలం సిరివరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి…
* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు పార్వతీపురంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం.. పాల్గొననున్న మంత్రి బొత్స సత్యనారాయణ
* విజయనగరం: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా నేడు గరివిడి మండలం కొండశంభాంలో వైద్య శిబిరం.. ప్రారంభించనున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ…
* నంద్యాల: నేడు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ కీలక సమావేశం.. చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ లోనే సమావేశం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్న నారా లోకేష్, పాల్గొననున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, మరో 12 మంది సభ్యులు
* విశాఖ: నేడు విశాఖకు సీపీఎం బైక్ యాత్ర.. స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో అన్ని మండలాల్లో ప్రచారం చేస్తున్న సీపీఎం. అక్టోబర్ 5న బహిరంగ సభ.. ముఖ్య అతిథిగా సీపీఏం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
* పల్నాడు: చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిభిరాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని.
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్ని నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,233 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 36,486 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.71 కోట్లు
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!