* నేటి నుంచి భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్.. తొలి వన్డేలో నేడు మొహాలీ వేదికగా తలపడనున్న ఇరు జట్లు.. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
* ఢిల్లీ: ఈ రోజు ఉదయం 11.30 గంటలకు మరోసారి సమావేశం కానున్న తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ”.. ఈరోజు పూర్తి జాబితాను ఖరారు చేసి, పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” ఆమోదానికి పంపనున్న తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ”.. నిన్న అర్ధరాత్రి వరకు, సుమారు 8 గంటల పాటు ఏకధాటిగా సాగిన సమాలోచనలు.
* తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఐదోవ రోజు.. ఉదయం 8 గంటలకు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.. తిరుమల చేరుకున్న ప్రతి భక్తుడికి గరుడ వాహన సేవ దర్శనం లభించేలా ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ
* ప్రకాశం : దర్శిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పాల్గొననున్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్..
* తూర్పుగోదావరి జిల్లా: నేటితో ముగియనున్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్.. స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు.. సెంట్రల్ జైలు నుండి వర్చువల్‌గా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పర్చడానికి జైలు అధికారుల సన్నాహాలు
* శ్రీకాకుళం: నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బైక్ యాత్ర.. ఉదయం 9 గంటలకు అంబేద్కర్ జంక్షన్ నుండి బయలుదేరనున్న బైక్ యాత్ర.
* శ్రీకాకుళం: నేడు ఎచ్చెర్ల, శ్రీచక్ర పీఠంలో కలిశెట్టి ఆధ్వర్యంలో మహిళలతో కుంకుమార్చన.. చంద్రబాబు ఆరోగ్యం, బెయిల్ కొసం పూజలు చేయనున్న టిడిపి నేతలు.
* ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కొనసాగనున్న టిడిపి నిరసనలు..
* ఏలూరు: నేటి నుంచి ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసనలు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జిపిఎస్ అమలు చేయడానికి వ్యతిరేకిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసనలు..
* పశ్చిమగోదావరి జిల్లా: ఈనెల 24న పాలకొల్లులో కాపు శంఖారావం.. టిడిపి, జనసేన పొత్తుపై కాపు సంక్షేమ సేన చర్చ..
* తిరుమల: గరుడ సేవ సంధర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు.. గ్యాలరిలో వేచివున్న భక్తులుకు నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యం.. అన్నప్రసాద సముదాయంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు భక్తులుకు అన్నప్రసాద వితరణ.. 5 వేల మంది సిబ్బందితో భధ్రతా ఏర్పాట్లు..
* రేపు ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరణ.. నడకదారిలో కోనసాగుతున్న ఆంక్షలు, తిరుమలలో 15 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు.. తిరుమలకు విచ్చేసే మార్గాలలో వాహనాలకు టోకేన్లు అందిస్తామంటున్న పోలీసులు
* అనంతపురం : జిల్లా వ్యాప్తంగా నేడు వినాయక నిమజ్జనం.. నాలుగుచోట్ల నిమజ్జనానికి ఏర్పాట్లు చేసిన అధికారులు.. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్టబందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.
* నంద్యాల: నేడు బనగానపల్లెలో వినాయక నిమజ్జనం.. భారీ ఏర్పాట్లు
* అనకాపల్లి జిల్లా: చంద్రబాబు అరెస్టు కు నిరసనగా మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పాదయాత్ర.. మాడుగుల మోదకొండమ్మ ఆలయం నుండి సింహాచం కొండ వరకు సాగనున్న పాదయాత్ర
* నంద్యాల లో నేడు గణేష్ నిమజ్జనం.. శోభాయాత్ర
* మహానంది క్షేత్రంలో నేడు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చనలు, సాయంత్రం పల్లకి సేవ
* నెల్లూరు జిల్లా: చేజర్లలో జిల్లా కలెక్టర్ హరి నారాయణ ఆధ్వర్యంలో జగనన్నకు చెబుదాం.. ప్రత్యేక స్పందన కార్యక్రమం
* నెల్లూరులోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం