* నేటి నుంచి ఐసీసీ ప్రపంచకప్ 2023 సమరం.. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్‌లో తలపడనున్న ఇంగ్లండ్, న్యూజిలాండ్.. పది జట్లు.. పది వేదికలు.. 48 మ్యాచ్ లు.. 46 రోజులు సాగనున్న క్రికెట్ వరల్డ్ కప్..
* అక్టోబర్ 8న చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్.. అక్టోబర్ 14న ఇండియా-పాకిస్తాన్ హైఓల్టేజ్ మ్యాచ్
* అమరావతి: నేటి నుంచి రెండు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన.. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీకి చేరుకోనున్న సీఎం.. సాయంత్రం ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే ఛాన్స్.. రాత్రికి ఢిల్లీలోనే బస.. రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశంలో పాల్గొననున్న సీఎం జగన్
* విజయవాడ: నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్.. రిమాండ్ పొడిగింపుపై నేడు ఆదేశాలు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు.. వర్చువల్ విధానంలో చంద్రబాబుని ఏసీబీ జడ్జి ముందు ప్రవేశ పెట్టనున్న అధికారులు.. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరుతూ నేడు మెమో ఫైల్ చేయనున్న సీఐడీ
* అమరావతి: ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ
* మాజీ మంత్రి బండారు సత్య నారాయణమూర్తిని అక్రమంగా అరెస్ట్ చేశారని దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ
* విజయవాడ: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల మీద నేడు ఏసీబీ కోర్టులో విచారణ.. IRR కేసు, ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పిటిషన్ల మీద కూడా నేడు ఏసీబీ కోర్టు విచారణ జరిపే అవకాశం
* ఈ రోజు రాత్రి హైదరాబాద్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రేపు జరిగే బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్న బీజేపీ నేషనల్ చీఫ్..
* విజయవాడ: ఇవాళ ముదినేపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర.. మచిలీపట్నం నుంచి సాయంత్రం 5 గంటలకు ముదినేపల్లి చేరుకోనున్న పవన్.. ముదినేపల్లిలో బహిరంగసభలో మాట్లాడనున్న జనసేన అధినేత
* అమరావతి: శాసనమండలిలో ముగ్గురు ప్రభుత్వ విప్ ల నియామకం.. మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, మెరిగ మురళీధర్, పాలవలస విక్రాంత్ ను ప్రభుత్వ విప్‌ల నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ జవహర్ రెడ్డి
* విశాఖ: నేడు కుర్మన్నపాలెంలో వామపక్షాలు ఆధ్వర్యంలో బహిరంగ సభ.. ముఖ్యఅతిథిగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు.. స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ ప్రక్రియ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్ధ కొనసాగించాలని డిమాండ్.
* నేటితో ముగియనున్న ఉత్తరాంధ్ర బైక్ ర్యాలీ..
* విశాఖ: నేడు విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం.. హాజరుకానున్న ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి
* ప్రకాశం : ఒంగోలు రూరల్ మండలం చింతాయగారిపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు..
* ప్రకాశం : త్రిపురాంతకంలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొనున్న సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున..
* ప్రకాశం : దర్శి మండలం బసిరెడ్డిపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ..
* ప్రకాశం : మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి విచ్చేయనున్న అష్టాక్షరి సంపత్ కుమార్ జీయర్ స్వామి… లక్ష్మీ చెన్నకేశవ స్వామి దర్శించి ప్రత్యేక పూజలు..
* పశ్చిమగోదావరి జిల్లా: మంత్రి కారుమురి నాగేశ్వరావు పర్యటన.. అత్తిలి మండలం, పాలి గ్రామం నందు జరుగు “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమానికి మంత్రి హాజరవుతారు. తణుకు నియోజకవర్గ స్థాయి “గురు పూజోత్సవ” కార్యక్రమంలో పాల్గొంటారు.
* తూర్పుగోదావరి జిల్లా : నేడు 26వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్..
* పశ్చిమ గోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
* ఏలూరు: ఈ నెల 7వ తేదీన ఏలూరులో మినీ జాబ్ మేళా.. జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ, సెట్ వెల్ మరియు APSSDC, ఏలూరు వారి సంయుక్త ఆధ్వర్యములో జాబ్ మేళా
* అనంతపురం : గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల, ముకుందాపురం,గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి…
* శ్రీ సత్యసాయి : నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా చెన్నేకొత్తపల్లి నుంచి ధర్మవరం దుర్గమ్మ గుడి వరకు పాదయాత్ర .
* తూర్పు గోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. చాగల్లు మండలం చంద్రవరం గ్రామం నందు జరుగు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో పాల్గొంటారు.. కొవ్వూరు మండలం అరికిరేవుల గ్రామం నందు జరుగు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో పాల్గొంటారు.
* తిరుపతి జిల్లా: వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర చివరి 5వ రోజు అట్టహాసంగా జరిగిన అమ్మవారి ఉత్సవ శోభాయాత్ర.. తెల్లవారుజామున పట్టణ నడివీధి ఆలయంలో అమ్మవారి నిలుపు. తెల్లవారుజాము నుండి అమ్మవారిని దర్శించుకోనున్న భక్తజనులు, ప్రముఖులు. ఈరోజు సాయంత్రం అంగరంగ వైభవంగా జరగనున్న విరూప శోభాయాత్ర.. కైవల్యానది తీరంలో అమ్మవారి ప్రతిమ విరూపంతో ముగియనున్న జాతర.
* అనంతపురం : ఈనెల 8న నగరంలో ధర్మసంకల్ప సభ. వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ర్యాలీ. హాజరు కానున్న జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
* అనంతపురం : నేడు జిల్లా పరిషత్ స్టాడింగ్ కమిటీ సమావేశాలు.
* శ్రీ సత్యసాయి : కనగానిపల్లి మండలంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన 119 టిడిపి నాయకులు , కార్యకర్తలప్తె కేసులు నమోదు.
* నంద్యాలలో సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్ కలకలం.. ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం పేరిట సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్.. చలో రాజమహేంద్రవరం నిర్వహించి చంద్రబాబు నిర్బంధించిన జైలు వద్ద ధర్నా , రాస్తారోకో చేయాలని ఫేక్ పోస్టింగ్ లో పిలుపు.. మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్ సహా 6 మంది బాలయ్య అభిమానులను అదుపులోకి తీసుకున్న పోలీసులు .. అర్ధరాత్రి వరకు పీఎస్‌లో నిర్బంధం
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* గుంటూరు : రాష్ట్రంలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ గోరంట్ల లోని బీపీ మండల్ విగ్రహం వద్ద ,నేడు బీసీ సంఘాల నిరసన..
* చిత్తూరు: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు..
* తిరుపతి: నేడు మహిళా సాధికారతపై పద్మావతి మహిళ వర్శిటిలో సమావేశం.. ఉమెన్ ఎంపవరింగ్ ఉమెన్ పై జరగనున్న సమావేశంలో పాల్గొనున్న మంత్రి రోజా, మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మా..ఇతర ప్రముఖలు
* విశాఖ: నేడు,రేపు మహిళా పారిశ్రామిక వేత్తలు సదస్సు.. స్టార్టప్ ఇండియా, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ నిర్వహణ. హాజరుకానున్న మంత్రి అమర్నాథ్
* నంద్యాల: డోన్ లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నేడు సౌర్య జాగరణ యాత్ర.. సాయంత్రం రామాలయంలో సభ..