* ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023: నేడు శ్రీలంకతో ఆస్ట్రేలియా ఢీ.. లక్నో వేదికగా మ్యాచ్
* అమరావతి: ఇవాళ సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన.. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. విశాఖ మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 2 వద్ద ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం.. హెలీప్యాడ్ వద్ద జీవీఎంసీ బీచ్ క్లీనింగ్ మిషన్లు ప్రారంభించనున్న జగన్.. అనంతరం అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో యుజియా స్టెరైల్ ప్రెవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవం.. సభను ఉద్దేశించి ప్రసంగం.. అచ్యుతాపురం ఏపీసెజ్‌కు లో లారస్ ల్యాబ్స్ యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్ ప్రారంభించనున్న సీఎం.. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం
* జనగామ జిల్లా: నేడు జనగామకు సీఎం కేసీఆర్.. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. జర్మనీ టెక్నాలజీతో సీఎం కేసీఆర్ సభ టెంట్ ఏర్పాటు.. బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలతో గులాబీ మయంగా మారిన జనగామ పట్టణం.
* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఇవాళ గాయత్రీదేవి అవతారంలో దుర్గమ్మ దర్శనం.. దర్శనానికి ఉదయాన్నే క్యూలైన్‌లో భక్తులు.. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు.. వృద్ధులు, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
* నేడు శ్రీశైలంలో 2వ రోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు .. సాయంత్రం బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి దర్శనం.. మయూరవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్న శ్రీస్వామి, అమ్మవారు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో ఆదిదంపతుల గ్రామోత్సవం
* భద్రాద్రిలో నేటినుండి దేవీ నవరాత్రి ఉత్సవాలు.. నవరాత్రుల్లో భాగంగా నేడు సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు.
* అమరావతి: నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ.. స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్
* నేడు బీఆర్ఎస్‌లో చేరనున్న పొన్నాల లక్ష్మయ్య.. జనగామ సభా వేదికపై సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిక
* నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ.. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చర్చ
* హైదరాబాద్: నేడు గవర్నర్ తమిళిసైని కలవనున్న బీజేపీ మోర్చా నేతలు.. విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్య ఘటనపై చర్చ
* తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,440.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,410.. కిలో వెండి ధర రూ.77 వేలు
* నేడు సంగారెడ్డిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో గవర్నర్ తమిళి సై పర్యటన.. BVR మొహన్ రెడ్డి ఇన్నోవేషన్ ఆఫ్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్ తమిళి సై
* ప్రకాశం : త్రిపురాంతకంలో శ్రీ బాల త్రిపురసుందరి దేవి అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవములు.. సోమవారం 2వ రోజు, అలంకారము శ్రీ బ్రహ్మచారిని దేవి, పల్లకి సేవ హంస వాహనం
* బాపట్ల : జాతీయ కబాడీ క్రీడాకారుడు, చీరాల మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ బోనిగల అశోక్ కుమార్ కాంస్య విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమం, ముఖ్య అతిధులుగా హాజరుకానున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీలు సందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి..
* ప్రకాశం : శ్రీ దేవి శరన్నవరాత్రుల భాగంగా రెండవ రోజు మార్కాపురం లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం..
* ప్రకాశం : చీమకుర్తి హరిహర క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గాయత్రీ దేవి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు.
* ప్రకాశం : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు..
* తూర్పుగోదావరి జిల్లా : నేడు 38వ రోజుకు చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గత నెల 9వ తేదీన చంద్రబాబు అరెస్ట్.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్న జైలు అధికారులు
* ఏలూరు: నేటి నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఈవీఎంల పరిశీలన.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండంచెల భధ్రత నడుమ బెల్ ఇంజనీర్ల సమక్షంలో తొలిదశ తనిఖీ ప్రక్రియ.. ఓటింగ్ యంత్రాల పరిశీలన ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు ఏలూరు జిల్లాకు బ్యాలెట్ యూనిట్లు 5560, కంట్రోల్ యూనిట్లు 4340, వివిప్యాట్లు 5210, కేటాయింపు..
* అనంతపురం : పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గుత్తి విద్యుత్ శాఖ కార్యాలయం ఎదురుగా వామపక్ష పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన.
* శ్రీ సత్యసాయి : ముదిగుబ్బ మండల కేంద్రంలో వ్తెసీపీ విస్త్రతస్థాయి సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి..
* అనంతపురం : కళ్యాణదుర్గంలో పర్యటించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* శ్రీ సత్యసాయి : ధర్మవరంలో నేడు చేనేత కార్మికుల సమావేశం.. ఒన్ డిస్ట్రిక్ ఒన్ ప్రొడక్ట్ పథకంలో సమీక్షా.
* అనంతపురం : ఈవీఎంలు, వివి ప్యాట్స్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేపట్టేందుకు ఏర్పాట్లు. నేటి నుంచి నవంబర్ 10వ తేదీ వరకు కొనసాగనున్న ఫస్ట్ లెవెల్ చెకింగ్.. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహణ.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు. మనుబోలు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరులోని కలెక్టరేట్..ఎస్పీ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం
* కాకినాడ: నేటి నుంచి ముత్తంగి అలంకారం లో దర్శనం ఇవ్వనున్న అన్నవరం సత్యదేవుడు.. ప్రతి సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముత్యాల వస్త్రాలంకరణలో స్వామి దర్శనం.. తొలి పూజ చేయనున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద