* ఢిల్లీ: ఏషియన్ గేమ్స్ అథ్లెట్లతో నేడు ప్రధాని నరేంద్ర మోడీ భేటీ.. మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారతీయ అథ్లెట్ల బృందంతో సంభాషించనున్న ప్రధాని.. ఏషియన్ గేమ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్
* ఆదిలాబాద్: నేడు జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. జన గర్జన పేరుతో బహిరంగ సభ.. పాల్గొననున్న అమిత్ షా.. నాగ్‌పూర్ నుంచి మధ్యాహ్నం 2.40కి ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో దిగనున్న అమిత్ షా. 3 గంటలకు సభా వేదికకు షా.. గంట పాటు సభ. ఆ తర్వాత హైదరాబాద్‌కు అమిత్‌షా.. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక బీజేపి మొదటి సభ.
* హైదరాబాద్: నేడు అమిత్ షాతో బీజేపీ ముఖ్యనేతల సమావేశం..రాత్రి 7 గంటల 40 నిమిషాలకు ఐటీసీ కాకతీయలో సమావేశం.. రెండు గంటల పాటు కొనసాగనున్న భేటీ.. ఎన్నికల సమాయత్తత, స్ట్రాటజీ, సమన్వయం పై చర్చ.. రాజకీయ పరిణామాలు. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించే అవకాశం
* ఢిల్లీ: సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు విచారణ.. ఉదయం కోర్టు ప్రారంభం కాగానే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న ముకుల్ రోహిత్గి.. నిన్న చంద్రబాబు తరపున సుదీర్ఘ వాదనలు వినిపించిన హరీష్ సాల్వే.. సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు విచారణ చేస్తున్న జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది
* హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు పితృ వియోగం.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి (86) కన్నుమూత.. ఈ రోజు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం, హాజరుకానున్న మంత్రి ఆదిమూలపు సురేష్..
* ప్రకాశం : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు..
* నెల్లూరు : లింగసముద్రంలో జేసీయస్ కన్వీనర్లు, గృహ సారాధులతో సమీక్షా సమావేశం, హాజరుకానున్న కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి..
* శ్రీకాకుళం: నేడు కాశీబుగ్గలో జీడి రైతుల రాష్ట్ర స్థాయి సమావేశం.. కాశీబుగ్గలోని టీకేఆర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జీడికి గిట్టుబాటు ధర, క్యాష్యూ బోర్డు స్థాపన తదితర అంశాలపై సమావేశం.
* శ్రీకాకుళం: పోలాకి మండలం, గుప్పిడిపేట PHC పరిధిలోని ప్రియాగ్రహారం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం.. ముఖ్యఅతిథిగా హాజరుకాన్న మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* నెల్లూరు: చేజర్ల మండలంలో నివేద గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* నెల్లూరు: టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు
* అనకాపల్లి జిల్లా: నేడు పూడిమడక తీరంలో “సాగర్ కవచ్”.. సముద్రపు దొంగలు, విదేశీ నేరగాళ్ల పట్టివేతకు రెండు రోజుల మాక్ డ్రిల్….
* అనంతపురం : కళ్యాణదుర్గం మండల పరిధిలోని పాలవాయి గ్రామంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* తూర్పుగోదావరి జిల్లా: నేడు 32వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్.. స్కిల్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు
* తూర్పు గోదావరి జిల్లా: నేడు దిశా కమిటీ సమావేశం.. జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ సమావేశం మధ్యాహ్నం 2.30 గంటలకు భేటీ
* కర్నూలు: హాలహర్వి మండలం నిట్రావాటు నుండి ఆలూరు వరకు రైతు సంఘం ఆధ్వర్యంలో పాద యాత్ర.. వేదవతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని డిమాండ్ తో పాదయాత్ర
* అనంతపురం : కదిరిలోని శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు.