* కామారెడ్డి: నేడు కామారెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని, డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ. ఏర్పాట్లు పూర్తి చేసిన బీజేపీ శ్రేణులు.
* నేడు ఖమ్మం జిల్లాలో ప్రియాంక పర్యటన, ఖమ్మం, పాలేరులో రోడ్ షో, సత్తుపల్లిలో కార్నర్ మీటింగ్, మధిరలో బహిరంగ సభలో పాల్గొననున్న ప్రియాంక
* నిజామాబాద్ : నేడు జిల్లాకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రాహుల్ గాంధీ.. అంబంగేట్ సమీపంలో గ్రౌండ్ లో విజయ భేరి బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్.
* నేడు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రాహుల్ గాంధీ పర్యటన.. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన రాహుల్.
* ప్రకాశం : దోర్నాలలో ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్న పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్..
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ ఎదుట సమస్యలు పరిష్కరించాలంటూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం..
* తిరుమల: రేపు ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల పర్యటన.. ప్రధాని హోదాలో మూడోసారి తిరుమలకు మోడీ, ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు, 2 వేల మంది పోలీసులుతో భధ్రతా ఏర్పాట్లు, భద్రతను పర్యవేక్షిస్తోన్న ఆరుగురు ఎస్పీలు
* ఏలూరు: నేడు దెందులూరు నియోజకవర్గం పరిధిలో మంత్రి ధర్మాన పర్యటన.. ఉదయం 9 గంటలకు SMR నగర్ వద్ద గల గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రం భవనాలను ప్రారంభిస్తారు, ఉదయం 9:20 గంటలకు గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.. ఉదయం 10 గంటలకు తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు.
* పశ్చిమగోదావరి జిల్లా: మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన వివరాలు.. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిగూడెం మండలం కృష్ణాపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఆల్సులమ్మ అమ్మవారి దివ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు క్యాంపు కార్యాలయంలో ఇంటి స్థలాలు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు
* అనంతపురం : పెద్ద వడుగూరు మండలం అప్పేచెర్ల గ్రామం లో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలను ప్రారంభించనున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
* అనంతపురం : బుక్కరాయసముద్రం మండలం ఎస్ ఆర్ ఐ టి కాలేజీలో ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.
* అనకాపల్లి జిల్లా: నేడు పెందుర్తిలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.. వేపగుంట నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు ర్యాలీ.. పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవం.. సబ్బవరం జంక్షన్ లో బహిరంగ సభ..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరు.. పొదలకూరు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం..
* మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని కోరుతూ సి.ఐ.టి.యూ. ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా
* నెల్లూరులోనే టిడిపి జిల్లా కార్యాలయంలో కోవూరు నియోజకవర్గ నేతల సమావేశం
* విశాఖ: నేడు జిల్లాలో పర్యటించనున్న పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమురు నాగేశ్వరరావు
* కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: నేడు సిర్పూర్ కు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్న సీఎం యోగి.
* సంగారెడ్డి: నేడు పటాన్‌చెరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన.. బీజేపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న అమిత్ షా
* అనకాపల్లి జిల్లా: నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటన.. జిల్లాలోని 7 నియోజకవర్గాల చెందిన బీజేపీ నాయకులు, బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశం.. సాయంత్రం వరకు అనకాపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొననున్న పురంధేశ్వరి
* తూర్పు గోదావరి జిల్లా: నేడు హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. చాగల్లు మండలం ,చాగల్లు గ్రామం , నాల్గవ సచివాలయం నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (166 వ రోజులో ) పాల్గొంటారు.. కొవ్వూరు మండలం ,అరికిరేవుల గ్రామం నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (166 వ రోజు) లో పాల్గొంటారు.
* తిరుమల: 9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,843 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,776 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.4 కోట్లు