* ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై-ముంబై మధ్య మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరుతో ఢీకొననున్న ఢిల్లీ
* బెంగుళూరులో ఇవాళ ప్రధాని మోడీ రోడ్ షో.. దాదాపు 26 కిలోమీటర్ల మేర రోడ్ షోలో పాల్గొననున్న మోడీ.. రోడ్ షో తర్వాత బడమి, హవేరి బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని
* కర్నాటక ఎన్నికల ప్రచారంలోకి సోనియా గాంధీ.. బెల్గావి, హుబ్లీలో రాహుల్ గాంధీతో కలసి ప్రచారం చేయనున్న సోనియా
* నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం.. క్రమేపీ బలపడి తుఫాన్ గా మారుతుందని ఐఎండీ అంచనా. ఈనెల 9, 10 తేదీల్లో కనిపించనున్న తుఫాన్ ప్రభావం.
* విజయవాడ: నేడు పదో తరగతి ఫలితాలు విడుదల.. ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి బొత్స సత్యనారాయణ.
* నేడు మహబూబ్ నగర్‌లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన. ఐటీ కారిడార్, శిల్పారామం ప్రారంభోత్సంలో పాల్గొననున్న కేటీఆర్.. బాయ్స్ కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభలో ప్రసంగించనున్న మంత్రి.
* ప్రకాశం : ప్రొద్దుటూరులో టిడ్కో గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్.
* బాపట్ల : చీరాల మండలం వాడరేవులో పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా సిడి మాను ఉత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు..
* ప్రకాశం : గిద్దలూరు లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా గరుడ సేవ, రథోత్సవం..
* తూర్పుగోదావరి: నేడు కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన.. ఉదయం 10 గంటలకు కొవ్వురు రోడ్ కం రైల్ బ్రిడ్జి నుంచి పర్యటన ప్రారంభం.. చాగల్లు మండలం ఐ పంగిడి, చాగల్లు, ఊనగట్ల, బ్రాహ్మణగూడెం ప్రాంతాలలో పంట నష్టపోయిన రైతులకు పరామర్శ.. మధ్యాహ్నం రెండు గంటలకు నిడదవోలు మండలం కంసాలిపాలెం, తీరిగూడెం, సింగవరం ప్రాంతాల్లో పర్యటన..
* కడప: నేడు ప్రొద్దుటూరులో పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్న జిల్లా ఇంఛార్జి మంత్రి ఆది మూలపు సురేష్…
* అనంతపురం: కంబదూరు మండల పరిధిలోని పాళ్ళూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషాశ్రీచరణ్.
* అనంతపురం : నేడు ఉమ్మడి జడ్పీ సర్వసభ్య సమావేశం.
* నెల్లూరు: ముత్తుకూరు, పొదలకూరు మండలాలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
* అల్లూరి జిల్లా మన్యం ఆరాధ్య దేవత శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి మూల విరాట దర్శనం నేటి నుండి మూడురోజుల పాటు మూసివేత.. జాతర మహోత్సవాలు నేపథ్యంలో అలంకరణ నిమిత్తం ఆలయం మూసివేత.
* గుంటూరు : నేడు ఎల్ఈఎం గ్రౌండ్ లో ఐపీఎల్ మ్యాచ్ ల ప్రదర్శన.. నేడు ,రేపు భారీ డిజిటల్ స్క్రీన్ లతో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసిన బీసీసీఐ
* ఖమ్మం: నేడు మాజీ ఎంపీ పొంగులేటి ఆధ్వర్యంలో రైతు భరోసా ర్యాలీ. ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్ల మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ.. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి డిమాండ్.