* హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో నేడు టీఎస్‌పీఎస్సీ గ్రూప్- 4 పరీక్ష.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష..
* ఖమ్మం: 108వ రోజుకు చేరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్ర.. కోదాడ క్రాస్ రోడ్ నుంచి నేడు ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభం.. వరంగల్ క్రాస్ రోడ్, మున్నేరు బ్రిడ్జి, ఖమ్మం డీసీసీ ఆఫీస్, ఇల్లందు క్రాస్ రోడ్, శ్రీ శ్రీ సర్కిల్ వరకు కొనసాగనున్న పాదయాత్ర
* కడప: నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో జగనన్న సురక్షా కార్యక్రమం ప్రారంభం.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు.. మనుబోలు… వెంకటాచలం మండలాలలో జరిగే జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు
* కాకినాడ: అన్నవరం సత్యదేవుని కొండపై నేటి నుంచి ప్లాస్టిక్ నిషేధం.. భక్తులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ పదార్థాలు కొండపైకి తీసుకు రాకుండా కట్టడి.. కొండ కిందనే పరిశీలించాలని అధికారులను ఆదేశించిన ఈవో
* కాకినాడ: నేడు తునిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
* నేటి నుంచి కాకినాడ జేఎన్టీయూలో రెండు రోజులపాటు ఏపీ ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డు ఐదో సమావేశం.. ఉన్నత విద్యలో బోధనాపరమైన అంశాల గురించి సమావేశం
* అంబేద్కర్ కోనసీమ జిల్లా : శనిత్రయోదశి సందర్భంగా మందపల్లి దేవస్థానంలో పొటెత్తిన భక్తులు.. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన భక్తులు.. మందపల్లి దేవస్థానంలో శనేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్న భక్తులు.. శని దోష నివారణకు నువ్వుల నూనెతో పూజలు చేసి నల్లని వస్త్రాలను దానం చేస్తున్న భక్తులు.. శనేశ్వరుడి దర్శనం కోసం ఆలయంలో బారులు తీరిన భక్తులు
* అనంతపురం : జిల్లాలో నేటి నుంచి బియ్యం ,రాగులు , జొన్నలు పంపిణీ.
* అనంతపురం : ఈనెల 8 న కళ్యాణదుర్గంలో సిఎం జగన్ పర్యటన. ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు.
* అంబేద్కర్ కోనసీమ జిల్లా : నేటి నుండి ఈనెల 31వ తేదీ వరకు అమలాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు పొడిగింపు-డీఎస్పీ అంబికా ప్రసాద్.. జూన్ 10వ తేదీ అర్ధరాత్రి నుండి అమలులో ఉన్న పోలీస్ సెక్షన్ 30
* పశ్చిమగోదావరి జిల్లా: తణుకులో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..
* నిజామాబాద్: నేడు బాబ్లీ గేట్లు తెరవనున్న అధికారులు .. నేటి నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లను తెరచి ఉంచనున్న అధికారులు .. తెలంగాణ- మహారాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర జలవనరుల అధికారుల సమక్షంలో బాబ్లీ గేట్లను తెరవనున్న సాగునీటి అధికారులు
* గుంటూరు : ప్రభుత్వ హాస్పిటల్ లో నేడు డాక్టర్స్ డే వేడుకలు, హాజరుకానున్న మంత్రి విడదల రజని…
* బాపట్ల: నేడు కొల్లూరు మండలం ఈపూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున…
* పల్నాడు: నేడు నాదెండ్ల మండలం అప్పాపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజిని…
* గుంటూరు: పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర నాయకుల ప్రదర్శన…
* గుంటూరు జిల్లాకు చేరుకున్న టీడీపీ భవిష్యత్తుకు భరోసా బస్సు యాత్ర.. నేడు తుళ్లూరు మండలం వడ్డమానులో ప్రారంభంకానున్న బస్సు యాత్ర.. అనంతరం తుళ్లూరులో రచ్చబండ కార్యక్రమం