* నేడే సంక్రాంతి.. తెలుగులొగిళ్లలో ఘనంగా సంబరాలు.. కళకళలాడుతోన్న గ్రామాలు.. ముగ్గులతో ముస్తాబైన వాకిళ్లు, పిల్లల ఆటాపాటలతో సందడి.. నేడు మకర సంక్రాంతి, రేపు కనుమ
* నేటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని తెలంగాణ అధికారుల బృందం పర్యటన.. 70 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యే అవకాశం.. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన
* తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. సర్వదర్శనానికి 16 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 86,107 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 29,849 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు
* శ్రీ సత్యసాయి : ఈనెల 16న సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన. రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్ , పరోక్షపన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు. 503 ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణకేంద్రం. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం.. లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్న మోడీ.
* బాపట్ల : కారంచేడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం..
* బాపట్ల : కొరిసపాడు మండలం రావినూతల, పంగులూరు మండలం కొండమంజులూరులలో సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు..
* ప్రకాశం : సంక్రాంతి పండుగ సందర్భంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం, పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసే స్పందన కార్యక్రమం రద్దు..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలం తోడేరులో జరిగే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు కొత్తపేటలో ప్రభల తీర్థం.. కొత్తపేట ప్రభుత్వ హైస్కూల్లో జరుగునున్న ప్రభల తీర్థం.. కొత్తపేటలోని పాత , కొత్త రామాలయ వీధుల నుండి ప్రభలను ఊరేగింపుగా తీసుకుని రానున్న నిర్వాహకులు.. భక్తుల దర్శనార్థం హై స్కూల్ గ్రౌండ్ లో ప్రభలు ఏర్పాటు.. వేలాదిగా తరలివచ్చి ప్రభలను దర్శించుకోనున్న భక్తులు.. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భారీగా బాణాసంచా కాల్చనున్న నిర్వాహకులు..
* తిరుపతి: నారా వారిపల్లె వేడుకగా సంక్రాంతి సంబరాలు.. నాగాలమ్మ గుడిలో పూజలు చేయనున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు.. అనంతరం తల్లిదండ్రులకు నివాళులర్పించనున్న చంద్రబాబు
* తిరుమల: ఇవాళ్టి నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పున:రుద్దరణ
* తిరుమల: రేపు ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలో గోదాదేవి పరిణయోత్సవం.. రేపు మధ్యహ్నం 1 గంటకు పార్వేట ఉత్సవం, ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
* ఢిల్లీ: రేపు చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై విచారణ
* నంద్యాల: నేడు శ్రీశైలంలో 4వ రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. రాత్రి శ్రీస్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం.. సాయంత్రం నందివాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న ఆదిదంపతులు, శ్రీస్వామి అమ్మవారికి గ్రామోత్సవం
* కర్నూలు: మంత్రాలయంలో రెండు రోజులుగా కొనసాగునున్న భక్తులు రద్దీ.. గదులు దొరక్క భక్తుల ఇబ్బందులు. రోడ్లుపై ఎక్కడికక్కడే నిలిచిన వాహనాలు.. ట్రాఫిక్ కి అంతరాయం…
* అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకులోయ మండలం కొత్త భల్లుగుడ గ్రామంలో జన్మన్ కార్యక్రమం. వర్చువల్ విధానంలో ఆదివాసులతో మాట్లాడనున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఈ రోజు ఉదయం 11 గంటలకు కార్యక్రమం.