నేడు శ్రీశైలంలో 3వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయంలో శ్రీస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంకాలం హంసవాహనంపై శ్రీస్వామి, అమ్మవారు పూజలందుకోనున్నారు.
చికెన్, గుడ్లు వినియోగంపై ఫ్రీ చికెన్ మేళాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మేళాలు నిర్వహించనున్నారు. అపోహలను తొలగించడమే ఈ మేళాల లక్ష్యం.
నేటి నుండి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. మొదటి పూజ స్వామి వారి ప్రథమ భక్తుడైన భక్త కన్నప్ప ధ్వజారోహణంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత అభిషేక సేవలు, అంతరాలయం దర్శనాలను అధికారులు రద్దు చేశారు.
నేడు బద్వేల్, హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.
వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లు మీద నేడు ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.
ఇవాళ విజయవాడలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖామంత్రి హరదీప్ సింగ్ పూరి పర్యటించనున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి అమరావతికి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు.
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇవాళ ఆన్ లైన్లో మే నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి.
మైనార్టీ సంక్షేమ శాఖలపై డిప్యూటీ సీఎం భట్టి సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్ కూర్పుపై సమీక్ష చేయనున్నారు.
వికారాబాద్, నారాయణ పేట జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
నేడు మెదక్ జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. బీజేపీ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా ఓటర్ల సభలో పాల్గొననున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ టీమ్స్ ఢీకొననున్నాయి.