NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

నేడు తూర్పుగోదావరి జిల్లాలో హోంమంత్రి తానేటి వనిత పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొవ్వూరు క్యాంప్ ఆఫీసులో హోం మంత్రి అనిత ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అనంతరం కొవ్వూరులో స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు హైదరాబాదులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నెల్లూరు రూరల్ పరిధిలోని గుడపల్లిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించనున్నారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో మాజీ మంత్రి నారాయణ పర్యటించనున్నారు.

అఖిలపక్ష ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో విశాఖ సరస్వతి పార్క్ నుండి జీవీఎంసీ వరకు సంఘీభావ ప్రదర్శన చేయనున్నారు. అంగన్వాడీ, మున్సిపల్, సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. కార్మికులపై నిర్బంధం ఆపాలని డిమాండ్ చేయనున్నారు.

నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరుపతికి వెళ్లనున్నారు. రేపు శ్రీవారిని తెలంగాణ గవర్నర్ దర్శించుకోనున్నారు. ఇవాళ రాత్రికి శ్రీరచనా అతిధి గృహంలో తమిళిసై బస చేస్తారు.

ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆటో డ్రైవర్ల సమస్యలపై పరిశీలన కమిటీ సమావేశం జరగనుంది. ఆటో డ్రైవర్లతో కమిటీ చర్చించనుంది. మధ్యాహ్నం 12:30కు తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లతో కమిటీ చర్చలు జరపనుంది.

Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుపతికి వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం భట్టి.. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వెళుతున్నారు. ఇవాళ రాత్రికి శ్రీరచనా అతిధి గృహంలో భట్టి బస చేస్తారు. రేపు శ్రీవారిని భట్టి దర్శించుకోనున్నారు.

న్యూఇయర్ వేడుకల సందర్భంగా మెట్రో రైళ్ల సమయంను ఆదివారం అధికారులు పొడిగించారు. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ట్రాఫిక్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 అర్ధరాత్రి దాటే వరకు హుస్సేన్‌సాగర్‌ చుట్టూ (ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు) వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయి. జనవరి 1న రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు (పీఎన్‌ఆర్‌ మార్గ్‌), అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు.