1. నేడు గజ్వేల్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అభ్యర్థిగా ప్రకటించాక తొలిసారి గజ్వేల్‌కు ఈటల. ఒంటిమామిడి నుంచి గజ్వేల్ వరకు భారీ ర్యాలీ. ముట్రాజ్‌పల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ఈటల. ఈటల సమక్షంలో బీజేపీలో చేరనున్న మాజీ మున్సిపల్ ఛైర్మన్, బీఆర్ఎస్ అసంతృప్తి నేతలు.
2. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విస్తృత ఎన్నికల ప్రచారం. 14 రోజుల కేసీఆర్ షెడ్యూల్ విడుదల చేసిన బీఆర్ఎస్. రోజు మూడు నియోజకవర్గాల చొప్పున కేసీఆర్ ప్రచారం. నేడు మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్న కేసీఆర్. అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో బహిరంగ సభలు.
3. నేడు త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనా రెడ్డి ప్రమాణం. ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం.
4. నేడు తూ.గో జిల్లాలో సీఎం జగన్ పర్యటన. రాజానగరం మండలం దివాన్చెరువలో జక్కంపూడి రాజా తమ్ముడి వివాహ రిసెప్షన్‌కు హాజరు. ఉదయం 10.15కు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న జగన్.
5. నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర. తొలి దశలో 39 నియోజకవర్గాల్లో సాగనున్న యాత్ర. మూడు ప్రాంతాల్లో ఒకేసారి యాత్ర ప్రారంభం. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమలో సింగనమల నుంచి బస్సు యాత్ర. ప్రతి రోజు మూడు ప్రాంతాల్లో మూడు సభలు ఏర్పాటు. నవంబర్ 9తో ముగియనున్న వైసీపీ బస్సు యాత్ర.
6. నేడు మరోసారి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ. తెలంగాణ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు. 40 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ సీఈసీ. మిగిలిన జాబితాపై నేడు మరోసారి భేటీకానున్న కమిటీ.
7. నేడు ద్వారకా తిరుమల చినవెంకన్న కల్యాణం. మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చినవెంకన్న. సూర్యప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం. సాయంత్రం 5 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం. రాత్రి 8 గంటలకు స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం.
8. చంద్రబాబు లాయర్ల పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టు విచారణ. కాల్ డేటా రికార్డులు ఇవ్వాలన్న పిటిషన్‌పై విచారణ. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా ఇవ్వాలని పిటిషన్ దాఖలు.
9. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.77,500 లుగా ఉంది.
10. వరల్డ్‌కప్‌లో నేడు ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక. మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరులో మ్యాచ్.
11. నేడు తెలంగాణకు కేంద్రహోంమంత్రి అమిత్ షా. రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్న అమిత్ షా. రేపు నేషనల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్. ముఖ్య అతిథిగా హాజరుకానున్న అమిత్ షా. రేపు మధ్యాహ్నం సూర్యాపేటసభలో పాల్గొననున్న అమిత్‌షా.