Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

నేడు గుజరాత్‌ పట్టణ ప్రగతి పథం వేడుకలు. వేడుకలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. పీఎం ఆవాస్‌ యోజన లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ. స్థానిక సంస్థలకు రూ.3,300 కోట్ల నిధులు విడుదల.

ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్‌ లక్నో. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌.

నేటి నుంచి ఆసియా అథ్లెటిక్స్‌ ప్రారంభం. ఫేవరెట్‌గా బరిలో దిగనున్న తెలుగమ్మాయి జ్యోతి. గత ఆసియా క్రీడల్లో పసిడి గెలిచిన జ్యోతి.

కడప జిల్లా : నేటి నుంచి కడపజిల్లా లో టీడీపీ మహానాడు.. ఉ.10:30కి మహానాడు ప్రారంభం.. మహానాడులో పాల్గొననున్న చంద్రబాబు, టీడీపీ నేతలు.. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ప్రధానంగా చర్చ.. లోకేష్‌ ప్రతిపాదించిన 6 అంశాలపై ఫోకస్‌.. అనంతరం టీడీపీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్‌.. రేపు రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై చర్చ.. ఎల్లుండి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ.

విశాఖ :నేడు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ముట్టడించనున్న కార్మిక సంఘాలు. కొత్తగా 1,480 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగింపుకు రంగం సిద్ధం చేయడంపై నిరసన.

అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి రానున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 5.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. అనంతరం సాయంత్రం 6 గంటలకు తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకోనున్న జగన్..

నేడు ఉదయం 10 గంటలకు టూరిజం ఎంపవర్డ్ కమిటి సమావేశం. ఈ సమావేశంలో పాల్గొననున్న డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క. 11.30 కి రాజీవ్ యువ వికాసంపై సమీక్ష. రాత్రికి ఖమ్మం బయలుదేరనున్న డిప్యూటీ సీఎం భట్టి.

విజయనగరం : పేలుళ్ల కుట్ర కేసు. నేడు ఐదో రోజు పోలీస్‌ కస్టడీకి సిరాజ్‌, సమీర్‌. సిరాజ్‌, సమీర్‌ను విచారించనున్న ఎన్‌ఐఏ బృందం. ఇప్పటికే పలు కీలక విషయాలు వెల్లడించిన సిరాజ్‌. అహీం గ్రూప్‌కు చెందిన 20 మంది ఆచూకీ కోసం విచారణ.

నెల్లూరు: నేడు కాకాణి పిటిషన్‌పై విచారణ. స్పెషల్‌ కేటగిరి ఖైదీగా గుర్తించాలని కాకాణి పిటిషన్‌. అక్రమ మైనింగ్‌ కేసులో కాకాణికి రిమాండ్‌.

Exit mobile version