*కర్నూలు: నేడు సీఎం జగన్ పత్తికొండ పర్యటన.. బటన్ నొక్కి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
*నేటి నుంచి ఏపీలో పెరగనున్న భూముల ధరలు.. రాష్ట్రంలోని అత్యధిక ఆదాయం ఇచ్చే 20 శాతం గ్రామాల్లో పెంపు.. 30 నుంచి 35 శాతం వరకు పెరిగిన భూముల ధరలు.. గతేడాది భూమి విలువ పెరిగిన కొత్త జిల్లాల్లో కాస్త తక్కువగా పెంపు.
*నేడు ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ.. 63.14 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1739.75 కోట్లు విడుదల.. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ
*నేడు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల ప్రారంభం
*తిరుపతి: నేడు పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా తెప్పలపై విహరించనున్న సుందరరాజస్వామీ వారు
*నిజామాబాద్ : నేటి నుంచి ఈనెల 9వరకు తెలంగాణ విశ్వ విద్యాలయానికి సెలవులు.. మధ్యాహ్న భోజనం అనంతరం హాస్టల్స్ ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన వీసీ
*ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ ఈడీ ఛార్జ్ షీట్‌పై రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టులో విచారణ.. మనీష్ సిసోడియా పై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ను రెండ్రోజుల క్రితం పరిగణలోకి తీసుకున్న స్పెషల్ కోర్టు
*భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేడు నేపాల్ ప్రధాని భేటీ
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,850.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,930.. కిలో వెండి ధర రూ.76,800