*నేడు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్.. వారితో పాటు మంత్రులుగా 8 మంది ప్రమాణం
*నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్
*నేటి నుంచి మహబూబ్‌నగర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్.. కాచిగూడ-విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును మహబూబ్‌నగర్ వరకు పొడిగిస్తూ రైల్వేశాఖ నిర్ణయం
*నేడు ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి బుగ్గన
*నేడు వేమూరులో నిరసన పాదయాత్ర నిర్వహించనున్న మంత్రి మేరుగ నాగార్జున.. .పేదల ఇళ్ల స్థలాలను చంద్రబాబు స్మశానాలుగా పోల్చడాన్ని నిరసిస్తూ పాదయాత్ర చేయనున్న మంత్రి
*ఉత్తరాంధ్రలో నేటితో ముగియనున్న చంద్రబాబు పర్యటన.
*నేడు ఏపీ గవర్నర్‌ను కలవనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
*ఐపీఎల్‌లో నేడు.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్