నేడు లోక్ సభ ఎన్నికల తుదిదశ ఎన్నికల పోలింగ్. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్. 8 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్.
నేడు గవర్నర్‌ను కలువనున్న సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్‌ను తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించనున్న రేవంత్.
నేడు పోస్టల్ బ్యాలెట్‌పై ఏపీ హైకోర్టులో విచారణ. సాయంత్రం 6 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌పై హైకోర్టు తీర్పు.
బెంగళూరులో నేడు సిట్ కస్టడీకి ప్రజ్వల్ రేవణ్ణ. నేటి నుంచి 6 రోజుల పాటు రేవణ్ణను ప్రశ్నించనున్న సిట్. అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు.
నేడు కొండగట్టులో హనుమాన్ జయంతి. భారీగా తరలిస్తున్న భక్తులు. హనుమాన్ మాలను విరమణ చేస్తున్న భక్తులు. స్వామి వారి దర్శనానికి 2గంటల సమయం.
తమిళనాడులోని కన్యాకుమారిలో నేడు ప్రధాని మోడీ పర్యటన. రాక్ మెమోరియల్ దగ్గర మూడో రోజు మోడీ ధ్యానం. మధ్యాహ్నం వరకు కొనసాగనున్న మోడీ ధ్యానం. అనంతరం కన్యాకుమారి నుంచి ఢిల్లీకి తిరుగు పయనం.
నేడు ఢిల్లీలో విపక్ష కూటమి నేతల సమావేశం. మధ్యాహ్నం 3గంటలకు ఖర్గే నివాసంలో భేటీ. హజరుకానున్న ఇండి కూటమిలోని ప్రధాన పార్టీల నేతలు.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,750 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,900 లుగా ఉంది.