Indus River: సింధు నదీ జలాలు పాకిస్థాన్‌కు వదులుతారా?

  • భారత్, పాకిస్థాన్​ మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణ
  • చర్చల అనంతరం ఏకాభిప్రాయానికి వచ్చిన ఇరు దేశాలు
  • సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగింపు
Indus River

Indus River

భారత్, పాకిస్థాన్​ మధ్య పూర్తిస్థాయి తక్షణ కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఇరు దేశాలు శనివారం రోజు పరస్పరం చర్చించుకొని దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ చర్చల కోసం ఈరోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాకిస్థాన్​ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) నుంచి భారత డీజీఎంఓకు ఫోన్ కాల్ వచ్చింది. కాల్పుల విరమణ అంశంపై ఇద్దరూ చర్చించుకున్నారు. కాగా.. ఇప్పుడు అందరూ సింధు నదీ జలాల అంశంపై క్లారిటీ వచ్చింది.

READ MORE: Realme GT 7T: భారత్ లో లాంచ్‌కు సిద్ధమైన రియల్‌మీ GT 7T.. ఫస్ట్ లుక్ విడుదల.!

×
×
Ad

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ షరతులతో కూడినది. పొరుగు దేశంపై దౌత్యపరమైన చర్యలపై భారతదేశం వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. సింధు నదీ జలాలు ఒప్పందాన్ని నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ నిలిపివేత అలాగే కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. “కాల్పుల విరమణ అంశంపై ఇవాళ భారత్, పాకిస్థాన్​లు ఒక అవగాహనకు వచ్చాయి. ఇరుదేశాలు కాల్పులు, సైనిక చర్యలను ఆపాలని నిర్ణయించాయి. భారత్ మొదటి నుంచీ ఉగ్రవాదంపై పోరు సలుపుతోంది. ఇకపైనా అదే విధానాన్ని కొనసాగిస్తుంది” అని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్ స్పష్టం చేశారు.

READ MORE: South West Monsoon: ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే!

కాగా.. పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. పహల్గాం దాడి తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఏప్రిల్ 23న జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ”1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందం తక్షణమే నిలిపివేస్తున్నాం. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపే వరకు ఈ తాత్కాలిక నిషేధం అమలులో ఉంటుంది” అని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు.