Budget 2024 : దేశంలో ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 1 ఫిబ్రవరి 2024న ప్రవేశపెట్టనున్న తొలి మధ్యంతర బడ్జెట్ ఇది. అయితే బడ్జెట్‌కు ముందు ‘హల్వా వేడుక’ను నిర్మల సీతారామన్ స్వయంగా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకీ, ఈ ‘హల్వా వేడుక’ ఏంటి, నిర్మలమ్మ ఎందుకు రద్దు చేసింది. ‘హల్వా వేడుక’ దశాబ్దాలుగా బడ్జెట్‌తో ముడిపడి ఉన్న సంప్రదాయం. ఈ సంప్రదాయంలో బడ్జెట్ ముద్రణకు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖలో బడ్జెట్ రూపొందించే అధికారులకు పెద్ద పీట వేస్తారు. ఈ సమయంలో ఆర్థిక మంత్రి స్వయంగా హల్వా వండిచ్చి లాంఛనప్రాయంగా జరుపుకుంటారు.
‘హల్వా వేడుక’ అంటే ఏమిటి?
‘హల్వా వేడుక’ బడ్జెట్ ప్రింటింగ్ అధికారిక ప్రారంభాన్ని సూచిస్తుంది. బడ్జెట్‌లో గోప్యతను పాటిస్తారు. బడ్జెట్ మేకింగ్ అధికారుల ‘లాక్-ఇన్’ పీరియడ్ కూడా ఇదే. అవును, బడ్జెట్‌ను రక్షించడానికి, ఎలాంటి సమాచారం లీకేజీ కాకుండా నిరోధించడానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు అలాగే న్యాయ మంత్రిత్వ శాఖ, CBDT, CBIC, PIBకి చెందిన కొంతమంది అధికారులు నార్త్ బ్లాక్‌లో సుమారు 10 రోజుల పాటు ‘నిర్బంధంలో’ ఉంటారు. ఈ సమయంలో వారంతా ఇంటికి వెళ్లరు. వారి బంధువులను, కుటుంబ సభ్యులను సంప్రదించరు.
Read Also:Shirdi Sai Baba: గురువారం నాడు సాయిబాబాను ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి
ఒకవేళ తను అత్యవసర పరిస్థితుల్లో కుటుంబంతో లేదా ఎవరితోనైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు తన కాల్ పూర్తిగా ‘ఇంటెలిజెన్స్ బ్యూరో’ నిఘాలో ఉంటుంది. ఈ అధికారులందరూ ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత మాత్రమే ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం అయిన నార్త్ బ్లాక్ నుండి బయటకు వస్తారు. బడ్జెట్ ప్రింట్ చేయడానికి ఇక్కడ ప్రెస్ కూడా ఉంది.
‘హల్వా వేడుక’ రద్దు
నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్‌తో పాటు నిర్వహించాల్సిన ‘హల్వా వేడుక’ రద్దు చేయబడింది. ఇది 2022 బడ్జెట్‌కు ముందు జరిగింది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, ఆ సంవత్సరం ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘హల్వా వేడుక’ నిర్వహించకుండా అధికారులకు స్వీట్లు పంచింది.
Read Also:Income Tax Raid : పాలీక్యాబ్‌పై దాడులు.. రూ.1000కోట్ల నగదు విక్రయాలు, అభ్యంతరకర పత్రాలు లభ్యం