Agnipath Scheme: అసలు అగ్నిపథ్ స్కీమ్ ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశ సైన్యాన్ని మరింత సమర్థంగా తీర్చి దిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్ స్కీమ్’ని తీసుకువచ్చింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు జూన్ 14న ఈ స్కీమ్ ను ప్రకటించారు. భారతీయ సైన్యంలో యువరక్తాన్ని ప్రవేశపెట్టడంతో పాటు సైన్యం బడ్జెట్ లో పెన్షన్లకు వెచ్చించే నిధులకు కోత వేయడంతో పాటు ఈ నిధులను ఆధునిక ఆయుధాల కొనుగోలుకు వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు ఉన్న యువకులను 4 ఏళ్ల కాలానికి సైన్యంలో రిక్రూట్ చేసుకోనున్నారు. అయితే తాజాగా 21 ఏళ్ల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతూ కేంద్రం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల కాలానికి సంబంధించి వచ్చే మూడు నెలల్లో రిక్రూట్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తామని ఆర్మీ అధిపతులు వెల్లడించారు. ఈ అగ్నిపథ్ స్కీమ్ లో సెలక్ట్ అయిన వారిని ‘ అగ్నివీర్’లుగా పిలుస్తారు. వీరిని సైన్యంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల్లోకి తీసుకుంటారు. 45,000 మందిని తొలి బ్యాచ్ కింద తీసుకోనున్నారు. 2023 జూలై నాటికి తొలి బ్యాచ్ ను సిద్ధం చేయాలని సైన్యం భావిస్తోంది. ఇలా చేరిన వారికి 6 నెలల పాటు టెక్నాలజీతో పాటు ఆర్మీ శిక్షణ ఇవ్వనున్నారు.
Also Read
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ఆర్మీలో జాయిన్ అయిన అగ్నివీర్లకు సాధారణ సైనికుడికి ఉండే విద్యార్హత ఉండనుంది. పదో తరగతి మినిమం క్వాలిఫికేషన్. ఆన్ లైన్ విధానం ద్వారా ఎంపిక జరగనుంది. అయితే నాలుగేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన యువతను రిక్రూట్ చేసుకోనున్నారు. ఈ నాలుగేళ్లలో మొదటి ఏడాది రూ. 4.76 లక్షల ప్యాకేజీతో జీతం ప్రారంభం అయి నాలుగో ఏడాది రూ. 6.92 లక్షలకు చేరనుంది. దీంతో నాలుగేళ్ల తరువాత రిటైర్మెంట్ తరువాత సేవానిధి కింద ఒక్కొక్కరికి రూ.11.71 లక్షల ప్యాకేజీ రానుంది. దీంతో పాటు విధి నిర్వహణ సమయంలో రూ.48 లక్షల బీమా కవరేజీని కూడా కేంద్రం అందించనుంది.
అయితే పెన్షన్ వంటి సదుపాయాలు మాత్రం ఉండవు. నాలుగేళ్ల తరువాత కేవలం 25 శాతం మందిని మాత్రమే వారి అర్హత, ప్రతిభ ఆధారంగా మరో 15 ఏళ్ల పాటు సైన్యంలో కొనసాగించనున్నారు. నాలుగేళ్ల రిటైర్మెంట్ తరువాత వాళ్ల కెరీన్ ను ప్లాన్ చేసుకునేందుకు సేవానిధి ప్యాకేజీ ఉపయోగపడుతుందని కేంద్రం చెబుతోంది. దీంతో పాటు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా తరువాత పోలీస్, బీఎస్ఎఫ్ ఇతర రక్షణ దళాల్లో పనిచేసేందుకు ఉపయోగపడుతుంది.
సైన్యాన్ని యువతతో నింపడంతో పాటు కొన్ని ఖర్చులను తగ్గించుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇజ్రాయిల్, చైనా వంటి దేశాల్లో ఖచ్చితంగా సైన్యంలో పనిచేయాలనే నియమం ఉంది. దీని వల్ల వాళ్ల రిజర్వ్ బెంచ్ ను తయారు చేసుకుంటోంది. యుద్ధ సమయంలో రిజర్వ్ బెంచ్ అనేది కీలకంగా ఉంటుంది. 2022-23 రూ. 5,25,166 కోట్లు, ఇందులో రక్షణ పెన్షన్‌ల కోసం రూ. 1,19,696 కోట్లు కేటాయించారు. ఈ అగ్నిపథ్ స్కీమ్ సక్సెస్ అయితే పెన్షన్ బడ్జెట్ ను నూతన ఆయుధాల కొనుగోలుకు, టెక్నాలజీకి వినియోగించే అవకాశం ఏర్పడుతుంది.
తాజావార్తలు
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!