West Indies ODI Squad: భారత్‌తో వన్డే సిరీస్.. వెస్టిండీస్ జట్టు జట్టు ప్రకటన! విధ్వంసకర ప్లేయర్ రీ ఎంట్రీ
West Indies Announce ODI Squad against India 2023: స్వదేశంలో భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. మంగళవారం ఉదయం 15 మంది సభ్యులతో కూడిన జట్టును విండీస్ బోర్డు చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ ప్రకటించారు. వన్డే జట్టుకు షాయ్ హోప్ కెప్టెన్ కాగా.. రోవ్‌మన్ పావెల్ వైస్ కెప్టెన్. వన్డే సిరీస్‌కు స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్, ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ దూరమయ్యారు. అమెరికా వేదికగా జరగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో పూరన్ ఆడుతుండంతో జాతీయ జట్టుకు అందుబాటులో లేడు. మరోవైపు హోల్డర్‌కు విండీస్ సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.
వన్డే సిరీస్‌లో విండీస్ విధ్వంసకర ప్లేయర్ షిమ్రాన్ హెట్‌మైర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. విండీస్ క్రికెట్ బోర్డ్‌తో విభేదాల కారణంగా గత కొంత కాలంగా జట్టుకు హెట్‌మైర్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన హెట్‌మైర్.. రెండేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చాడు. అతడిపై విండీస్ భారీ ఆశలు పెట్టుకుంది. ఫాస్ట్ బౌలర్ ఒషానే థామస్‌కు కూడా విండీస్ జట్టులో చోటు దక్కింది. ఈ ఇద్దరి రాక విండీస్ జట్టుకు ఉపయోగపడనుందని చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ అన్నారు.
Also Read
Also Read: Lizard in Mouth: నోట్లో బల్లిపడి బాలుడు మృతి.. అసాధ్యం అంటోన్న జంతు నిపుణులు!
పేసర్ జేడెన్ సీల్స్, లెగ్ స్పిన్నర్ యాన్నిక్ కరియా మరియు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గుడాకేష్ మోటీ గాయాల నుంచి కోలుకొని మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టులోకి తిరిగి వచ్చారు. జూలై 27న బార్బడోస్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ మొదలు కానుంది. ఇక బీసీసీఐ ఈ వన్డే సిరీస్ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను భారత్ 1–0తో సొంతం చేసుకుంది.
వన్డేలకు వెస్టిండీస్ జట్టు:
షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, యానిక్ కారియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్మెయర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, జైడెన్ సిన్సీల్స్, రొమారియోక్ల్ సీల్స్.
Also Read: IND vs WI 2nd Test: భారత్, విండీస్ రెండో టెస్టు డ్రా.. సిరీస్ 1-0తో రోహిత్ సేన సొంతం!
West Indies name squad for CG United ODI Series powered by YES BANK
Full details here⬇️https://t.co/dlls8r9uZl pic.twitter.com/zGoHmgKACy
— Windies Cricket (@windiescricket) July 24, 2023
తాజావార్తలు
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్‌లో YS Jagan.. యూరప్ టూర్‌కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్‌డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!