AP Election Commission: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు మరో అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP State Election Commission: ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల (మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుటున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు వేయడానికి అభ్యర్థులకు అడ్డంకులు ఎదురయ్యాయని ఫిర్యాదులు వచ్చిన చోట మరో అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులతో ఈరోజు(శుక్రవారం) సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్లు వేయించాలని ఎస్ఈసీ సూచించింది. ఒకవేళ అవసరమైతే, అభ్యర్థులను నామినేషన్ కేంద్రాలకు సురక్షితంగా తీసుకెళ్లడానికి ఎస్పీలు తగిన భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అనుమతించింది. తన పిటిషన్లో వైసీపీ ప్రధానంగా పలు అంశాలను పేర్కొంది. తమ పార్టీ అభ్యర్థులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని, గృహనిర్బంధం చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. వెంటనే అభ్యర్థులను విడుదల చేసి, వారు నామినేషన్లు వేసేందుకు తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ, పత్రాలను చించేస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ దాడులకు ఒడిగట్టిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని కోరింది. పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నామినేషన్ల గడువును కనీసం 48 గంటల పాటు పొడిగించాలని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా జిల్లా కార్యాలయాలు, కలెక్టరేట్లలో నామినేషన్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్సీపీ హైకోర్టును అభ్యర్థించింది.
Also Read
- AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
- Bihar: తల్లి కోసం కొడుకు సంకల్పం.. పరుగెత్తుకుంటూ 12 జ్యోతిర్లింగాల యాత్ర
- Vidadala Rajini: విడదల రజిని ఇంటి వద్ద హైటెన్షన్.. ఎస్సై చర్యతో కిందపడ్డ మాజీ మంత్రి..
- Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
AP Election Commission: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు మరో అవకాశం
-
AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
-
Bihar: తల్లి కోసం కొడుకు సంకల్పం.. పరుగెత్తుకుంటూ 12 జ్యోతిర్లింగాల యాత్ర
-
Vidadala Rajini: విడదల రజిని ఇంటి వద్ద హైటెన్షన్.. ఎస్సై చర్యతో కిందపడ్డ మాజీ మంత్రి..
-
Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!