Suvendu Adhikari: ‘‘పారిపోండి, మీకు తిండి దండగ’’.. బంగ్లాదేశీయులకు బెంగాల్ సీఎం వార్నింగ్..
- త్వరగా పారిపోండి..
- జైలులో వేసి, తిండి పెట్టము..
- చొరబాటుదారులకు సీఎం సువేందు హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన వార్నింగ్ ఇచ్చారు. అక్రమ బంగ్లాదేశీ వలసదారులపై చర్యలు ముమ్మరం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. బంగ్లాదేశీ చొరబాటుదారుల్ని హెచ్చరిస్తూ.. ‘‘వేగంగా పారిపోండి. వారిని జైలులో ఉంచి పోషించడం మాకు ఇష్టం లేదు. వారిని జైలులో ఉంచి, తిండి పెట్టి మన డబ్బుల్ని ఎందుకు వృధా చేయాలి.?’’ అని అన్నారు.
బెంగాల్ వ్యాప్తంగా అక్రమ వలసదారుల్ని పారద్రోలే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే చాలా మంది బంగ్లాదేశీయులు సొంత దేశం వెళ్లడానికి సరిహద్దుల వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు, ప్రభుత్వం చొరబాటుదారుల్ని గుర్తించి, నిర్బంధించడానికి ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. వీరి గుర్తింపు నిర్ధారించిన తర్వాత వీరిని బంగ్లాదేశ్ పంపనున్నారు. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయుల్ని, రోహింగ్యాలను గుర్తించాలని ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది.
Also Read
- CM Vijay: రేపు ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోడీతో సమావేశం
- Iran: తాజ్ మహల్ చరిత్ర తెలిస్తే అక్కడికి వెళ్లేవాడే కాదు.. మార్కోరూబియోపై ఇరాన్ సెటైర్లు..
- Quad Meeting: పహల్గామ్ ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు ఖండించాయి.. ఉగ్రవాదంపై కలిసి పోరాడతామన్న భారత్
- Annamalai: “తమిళనాడును కుదిపేస్తున్న జంట హత్యలు”.. విజయ్‌పై అన్నామలై ఫైర్
ఈ విషయంపై బెంగాల్‌లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం సువేందు అధికారి లిఖితపూర్వక ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేశారు. నిర్బంధ కేంద్రాల కోసం అనువైన ప్రదేశాలను గుర్తించి, వీలైనంత త్వరగా చర్యలు ప్రారంభించాలని జిల్లా యంత్రాంగాలను ప్రభుత్వం ఆదేశించింది. సీఎం నుంచి వస్తున్న హెచ్చరికలతో ఉత్తర 24 పరగణాలు, మాల్దా జిల్లాల్లోని సరిహద్దు వద్దకు బంగ్లాదేశీయులు చేరుకుంటున్నారు. చొరబాటుదారుల్ని అడ్డుకోవడం బీజేపీ ఎన్నికల హామీల్లో ప్రధానంగా ఉంది. ఇప్పుడు సువేందు సర్కార్ చర్యలకు ఉపక్రమించింది.
తాజావార్తలు
-
Suvendu Adhikari: ‘‘పారిపోండి, మీకు తిండి దండగ’’.. బంగ్లాదేశీయులకు బెంగాల్ సీఎం వార్నింగ్..
-
CM Vijay: రేపు ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోడీతో సమావేశం
-
Iran: తాజ్ మహల్ చరిత్ర తెలిస్తే అక్కడికి వెళ్లేవాడే కాదు.. మార్కోరూబియోపై ఇరాన్ సెటైర్లు..
-
Over Your Dead Body: ఈ భార్యాభర్తల కన్నింగ్ ప్లాన్‌కు బుర్రపాడు… మెంటలెక్కించే ట్విస్టులు మావా
-
Quad Meeting: పహల్గామ్ ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు ఖండించాయి.. ఉగ్రవాదంపై కలిసి పోరాడతామన్న భారత్
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!