Over Your Dead Body: ఈ భార్యాభర్తల కన్నింగ్ ప్లాన్‌కు బుర్రపాడు… మెంటలెక్కించే ట్విస్టులు మావా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Over Your Dead Body: ఓటీటీలోకి వస్తున్న సినిమాలలో థ్రిల్లర్ కంటెంట్ నే ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఏ భాషలో వచ్చినా వీటిని మాత్రం అస్సలు వదిలిపెట్టడం లేదు. టైమ్ దొరకితే చాలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చిల్ అవుతున్నారు. హాలీవుడ్లో ఇటీవల థ్రిల్లర్ జానర్లో వస్తున్న సినిమాలు హత్యలు, ఛేజ్‌లతో మాత్రమే కాకుండా, కుట్రలు, కుతంత్రాలను కూడా బలంగా చూపిస్తున్నాయి. అలాంటి డార్క్ కామెడీ టచ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి వచ్చేసింది. ఒక ఇంట్లో భార్యాభర్తలు. బయటకు చూస్తే మంచి దాంపత్య జీవితం ఉన్నట్టు కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఒకరిపై ఒకరికి ద్వేషం, అనుమానం, పగ. ఒక వైపు మ్యారేజ్ డ్రామా, మరోవైపు క్రిమినల్ సర్వైవల్ గేమ్‌లా సాగిపోయే కథ ప్రేక్షకులను ఒక్క క్షణం కూడా రిలాక్స్ అవనివ్వదు. ట్విస్ట్ మీద ట్విస్ట్‌లతో కథను ముందుకు నడిపించే ఈ ఇంగ్లీష్ మూవీ పేరు ‘Over Your Dead Body’. థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి అడుగుపెట్టింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
2026 ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన ‘ఓవర్ యువర్ డెడ్ బాడి’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక Amazon Prime Video లో మే 26 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఇది రెంట్ పద్దతిలో మాత్రమే అందుబాటులో ఉంది. థ్రిల్లర్ సినిమాల్లో రిలేషన్షిప్ డ్రామా, డార్క్ హ్యూమర్, సర్వైవల్ టెన్షన్ అన్నీ కలిసిన కథలు ఇష్టపడేవారికి ‘Over Your Dead Body’ మంచి వీకెండ్ వాచ్‌గా మారుతోంది. జేసన్ సెజల్, సమరా వీవింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ఒక గ్రే షేడ్ ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎవరు మంచివాళ్ళు? ఎవరు ప్రమాదకా రులు? అనే సందేహం చివరి వరకు వెంటాడుతుంది. ముఖ్యంగా ఒకే లొకేషన్లో కథను నడిపిస్తూ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.
Also Read
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
కథ ఏమిటంటే
కథలో డాన్ బర్టన్ అనే ఫ్లాప్ ఫిల్మ్ డైరెక్టర్ తన కెరీర్లో చిన్న చిన్న యాడ్స్ తీసుకుంటూ జీవితం నెట్టుకొస్తుంటాడు. అతని భార్య లిసా మాత్రం నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటుంది. కానీ వాళ్ళ మధ్య ప్రేమ కంటే విభేదాలే ఎక్కువగా ఉంటాయి. డబ్బు, అసూయ, అహం కలిసి వాళ్ళ సంబంధాన్ని ప్రమాదకరంగా మారుస్తాయి. చివరకు డాన్ తన భార్యను చంపేసి ఆమె ఆస్తిని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం హెన్రీ అనే క్రిమినల్ సహాయం తీసుకుని నగరానికి దూరంగా ఉన్న ఓ లేక్ హౌస్‌కు భార్యను తీసుకెళ్తాడు.
అక్కడి వరకు చూస్తే ఇది సాధారణ క్రైమ్ థ్రిల్లర్ అనిపిస్తుంది. కానీ అసలు ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది. డాన్ తన ప్లాన్ అమలు చేయబోతుండగానే లిసా అతనిని కట్టేసి తానే ముందుగా అతన్ని చంపేయాలని వచ్చానని చెబుతుంది. ఈ ట్విస్ట్ తో చూసే ఆడియన్స్ కి కూడా పిచ్చెక్కిపోతుంది. అప్పటిదాకా ఒకరిపై ఒకరు వేసుకున్న ముసుగులు కూడా తొలగిపోతాయి.
అయితే ప్రేక్షకులు ఊహించని అసలు గందరగోళం ఆ తర్వాత మొదలవుతుంది. జైలు నుంచి తప్పించుకున్న ముగ్గురు ప్రమాదకర ఖైదీలు అప్పటికే ఆ ఇంట్లో దాక్కుని ఉంటారు. పీట్, టాడ్, అల్లెగ్రా అనే ఆ ముగ్గురు ఖైదీలు ఈ దంపతులను బంధించి డబ్బు కోసం చిత్రహింసలు పెట్టడం మొదలుపెడతారు. ఒక్కసారిగా హత్య చేయాలనుకున్న భార్యాభర్తలే ఇప్పుడు కలిసి బతికే పరిస్థితికి చేరుకుంటారు. చివరికి ఈ భార్యాభర్తలు ఆ క్రిమినల్స్ నుంచి తప్పించుకుంటారా ? వీళ్ళు మళ్ళీ కలిసి జీవిస్తారా ? అనే విషయాలతో ఈ క్లైమాక్స్ కూడా ఉత్కంఠంగా ఉంటుంది.
- Tags
- Amazon Prime Video
తాజావార్తలు
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?