Viral Video: ఓ పాత సామెత ఉంది.. ఎవరూ చూడనప్పుడు నృత్యం చేయండి అని.. కానీ, ప్రతీ చేతిలో స్మార్ట్ ఫోన్.. ఏదైనా వీడియో తీయాల్సిందే అని కాచుకొని కూర్చొని బ్యాచ్‌లు మరోవైపు.. వీడియోలు తరచుగా రికార్డ్ చేయడమే కాదు.. సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు ఈ డిజిటల్ యుగంలో.. అయితే, అనూహ్యంగా ఓ మంచి నృత్య ప్రదర్శన మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షించే అవకాశం కనిపిస్తోంది.. ఓ వివాహ వేడుకలో అతిథుల నృత్య ప్రదర్శనను రికార్డ్ చేస్తున్న కెమెరామెన్ అనూహ్యంగా స్టెప్పులు వేశాడు.. ఆ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూస్తే.. డ్యాన్స్ మాస్టర్ కావాల్సిన వాడు.. పొరపాటున ఫొటోగ్రాఫర్ అయ్యాడేమో? అనిపిస్తోంది.
ఒక వివాహ వేడుకలో అతిథుల డ్యాన్స్ రికార్డ్ చేస్తున్న ఫొటోగ్రాఫర్ వారితో పాటు కాలు కదిపాడు.. అలా ఇలా కాదు.. ఓ ఊపు ఊపేశాడు.. వీడియో చిత్రీకరిస్తూనే.. ఉత్సాహంగా స్టెప్పులు వేశాడు.. ఒక చేతిలో తన కెమెరాను బ్యాలెన్స్ చేసుకుంటూ, మరో చేతిలో తన డ్యాన్స్ మూవ్‌లను ప్రదర్శిస్తూ, పెళ్లికి హాజరైన వారితో కలిసి పంజాబీ బీట్‌లకు చక్కగా డ్యాన్స్ చేశాడు. తన డైనమిక్ డ్యాన్స్.. అతని సామర్థ్యంలో ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియా వీక్షకుల హృదయాలకు ఇట్టే కట్టిపడేశాడు.. అబీర్ అరోరా పాడిన ‘లాంగ్ మారే లష్కరే’ పాటకు కెమెరామెన్ మరియు అతిథి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. పాట యొక్క సాహిత్యం, “అదియాన్ ధోహ్ కే పైయాన్ ఝంఝరా. లాంగ్ మరే లష్కరే కంగనా తేరా నీ సాను కరే ఇషారే.” అంటూ సాగుతుండగా.. వీడియో గ్రాఫర్ డ్యాన్స్‌అందరినీ కట్టిపడేస్తోంది..
ఈ వీడియోని X హ్యాండిల్ పంజాబీ టచ్ షేర్ చేసింది మరియు సోషల్ మీడియాలో దాదాపు 2 లక్షల వీక్షణలను అందుకుంది, కామెంట్ సెక్షన్‌లో వీడియోపై చాలా మంది ప్రతిస్పందించారు. కెమెరామెన్ ఇప్పుడు ఆధార్ కార్డుకు అర్హులు.. అతను మనకు ఇష్టమైన ప్రమాణాలను నెరవేర్చాడు అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. అతను లైట్ డ్యాన్స్‌తో క్యాప్చర్ చేసిన ఫుటేజీని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మరోసారి చూసేందుకు పూనుకుంటారు అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.. నేను ఇప్పుడు వీడియో యొక్క తుది ఫలితాన్ని చూడాలనుకుంటున్నాను అంటూ మరో వినియోగదారు వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ ఫొటోగ్రాఫర్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
if your wedding camera man ain’t doing this …..ask for refund pic.twitter.com/UGOwDdedi5
— Punjabi Touch (@PunjabiTouch) August 14, 2023