మన తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలంలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా లేని విధంగా ఈసారి వేసవి తాపం అత్యధికంగా ఉంది. ఈ దెబ్బతో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 8 గంటల అయితే చాలు అప్పటి నుండే 40 డిగ్రీల పైన ఎండ కొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.
Also Read: LSG vs KKR: కేకేఆర్ దూకుడును తట్టుకొని లక్నో ప్లేఆఫ్ కు చేరువతుందా..
ఇక శనివారం నాడు.. వడదెబ్బ కారణంగా తెలంగాణ లోని పలు జిల్లాల్లో 19 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్ లో వెల్గటూర్ ఎంఈవో భూమయ్య కూడా ఉండడం గమనార్హం. ఇక జగిత్యాల, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, నారాయణపేట, మంచిర్యాల జిల్లాలో అత్యంత భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు 22 జిల్లాల్లో వడగాలులు వీయగా.. హైదరాబాద్ మహానగరంలో అయితే భారీ వేడికి గాలిలో ఉండే తేమ శాతం 15కు చేరింది. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Weather Update: హీట్ వేవ్ నుంచి ఉపశమనం.. మే 5 నుంచి 9 వరకు ఈ రాష్ట్రాల్లో వర్షాలు
మే నెల మొదటి వారంలోనే ఎండలు ఈ రేంజ్ లో ఉంటే .. రోహిని కార్తికి ఎండలు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు జిల్లాల్లో వేడిగాలులు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో ఎండ తీవ్రత మరింత దారుణంగా ఉంది. నంద్యాల, కర్నూల్ జిల్లాలకు సంబంధించి కొన్ని ఊర్లలో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.