NTV Telugu Site icon

Pm Modi: ఎన్నికల ప్రచారంలో మోడీని చంపేస్తాం.. ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు కాల్

New Project (8)

New Project (8)

చెన్నైలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కార్యాలయానికి బుధవారం (మే 22, 2024) రాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడు. దీంతో ఎన్ఐఏ ఒక్కసారిగా హైఅలర్ట్ అయింది. బెదిరింపు కాల్‌లో భాగంగా హిందీలో మాట్లాడిన ఓ వ్యక్తి.. ‘‘ఎన్నికల ప్రచారంలో ఎక్కడో ఓ చోట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తాం’’ అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ హెచ్చరిక చేసిన వెంటనే సదరు వ్యక్తి కాల్‌ను కట్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. గ్రేటర్ చెన్నై సిటీ పోలీసుల సైబర్ క్రైమ్ వింగ్‌కు సమాచారాన్ని అందించారు. వారు విచారణ చేపట్టి కాల్ వివరాలను విశ్లేషించారు. మధ్యప్రదేశ్ నుంచి ఆ బెదిరింపు కాల్ వచ్చిందని గుర్తించారు.

READ MORE: High Court: లోకేష్ పోస్టు చేసిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేయడం సరికాదు: పిన్నెల్లి తరఫు న్యాయవాది

కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని మధ్యప్రదేశ్ పోలీసులకు సూచించారు. దీంతో మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని కాలర్ మధ్యప్రదేశ్‌లోని ఏ లొకేషన్‌ నుంచి కాల్ చేశాడు ? అతడు ఏ సిమ్ కార్డును వాడాడు ? అనేది గుర్తించడంపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. కాగా.. వాంటెడ్ క్రిమినల్స్​ను పట్టుకోవడానికి ఎన్ఐఏ ఇటీవల పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్స్​ను ప్రకటించింది. వాటిలోనే ఓ నంబరుకు ఇప్పుడు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ రావడం గమనార్హం. కొన్నాళ్ల క్రితం ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల​ను​ చంపుతానంటూ ఓ ఆగంతకుడి నుంచి ఉత్తర​ప్రదేశ్‌లోని​ నోయిడాలో ఉన్న ఒక మీడియా సంస్థకు ఈమెయిల్ వచ్చింది. దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దానిపై అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాజాగా వచ్చిన ఈ బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన బహిరంగ సభతో పాటు తప్పకుండా రోడ్ షోలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ బెదిరింపు కాల్ భద్రతా సిబ్బందిలో గుబులు పుట్టిస్తోంది.