Site icon NTV Telugu

Harish Rao: సిద్దిపేట రైల్వే లైన్ కోసం కష్టపడ్డది మేము.. కేసీఆర్ లేకపోతే రైల్వే లైన్ లేదు

Harish Rao

Harish Rao

సిద్దిపేట జిల్లాకి రైలు రావడం గొప్ప వరమని మంత్రి హరీష్ రావు అన్నారు. నీళ్లు, నిధులు, జిల్లా ఈ కలల్ని నిజం చేసింది సీఎం కేసీఆర్ అని హరీష్ రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదని.. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగిన సిద్దిపేటకి రైలు తెస్తాం అని అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. 2006న రైల్వే లైన్ మంజూరు కాగా.. 33 శాతం రాష్ట్ర వాటా చెల్లించాలని కేంద్రం చెప్పిందన్నారు. సీఎం కేసీఆర్ రైల్వే లైన్ ని స్వయంగా రూపకల్పన చేశారని మంత్రి పేర్కొన్నారు.

TPGL 2023: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మూడో సీజన్‌.. నిర్వహణకు సర్వం సిద్ధం

రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారారు కానీ.. రైల్వే లైన్ రాలేదని మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ప్రజల అదృష్టం తెలంగాణ రావడం, కేసీఆర్ కావడమన్నారు. ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఉన్నారని.. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించింది కేసీఆర్ అని అన్నారు. సిద్దిపేట, మెదక్, కరీంనగర్ పై ఆనాటి ప్రభుత్వాలు కక్ష కట్టాయని తెలిపారు. బీజేపీ వాళ్ళు రైలు తమ వల్లే వచ్చిందని చెబుతున్నారు ఇది సిగ్గుచేటని ఆరోపించారు. 33 శాతం వాటా కడితే కనీసం సీఎం ఫోటో కూడా పెట్టలేదని మండిపడ్డారు.

Minister Jogi Ramesh: పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలకు మంత్రి కౌంటర్‌.. నేనే వస్తా.. నీతో పాటే నడుస్తా..!

2508 ఎకరాల భూ సేకరణ కోసం 310 కోట్లు చెల్లించింది తెలంగాణ ప్రభుత్వమేనని హరీష్ రావు అన్నారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 330 కోట్లు ఇచ్చామని.. ఇది చూస్తుంటే సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. సిద్దిపేట రైల్వే లైన్ కోసం కష్టపడ్డది మేము… డబ్బులు ఇచ్చింది మేమన్నారు. ఈ విజయం తెలంగాణ ప్రజలదని పేర్కొన్నారు. ఆనాడు 9 ఏళ్ళు కాంగ్రెస్ మోసం చేసింది…ఈనాడు బీజేపీ అబద్ధాలు ఆడుతుందని మండిపడ్డారు. కేసీఆర్ లేకపోతే రైల్వే లైన్ లేదని హరీష్ రావు అన్నారు.

Exit mobile version