Team India Coach: సూటిగా, సుత్తిలేకుండా చెప్తాడు.. టీమిండియా కోచ్‌గా అతడే బెస్ట్ ఆప్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wasim Akram on Team India Coach: భారత సీనియర్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త కోచ్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు పదవిలో ఉంటాడు. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెల 27 తుది గడువు. దాంతో హెడ్ కోచ్ పదవిని బీసీసీఐ ఎవరితో భర్తీ చేస్తుందని ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి కొనసాగడానికి సముఖంగా లేడు. కోచ్ పదవి రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్, జస్టిన్ లాంగర్, గౌతమ్ గంభీర్, రికీ పాంటింగ్, మహేళ జయవర్థెనెల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే టీమిండియా కోచ్‌గా గంభీర్ బెస్ట్ ఆప్షన్ అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు.
స్పోర్ట్స్కీడాలో ఇంటరాక్షన్ సందర్భంగా వసీమ్ అక్రమ్ టీమిండియా హెడ్ కోచ్ పదవిపై స్పందించాడు. తన ఓటు గౌతమ్ గంభీర్‌కే అని తెలిపాడు. సూటిగా సుత్తిలేకుండా చెప్పే గౌతీ.. ఏ విషయంపై అయినా రెండు రకాల మాటలు చెప్పడన్నాడు. ‘టీమిండియా హెడ్ కోచ్ రేసులో గౌతమ్ గంభీర్ ముందుంటాడు. ఎందుకంటే.. అతడు సూటిగా మాట్లాడుతాడు. అతడిని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. గౌతీ సాధారణ వ్యక్తే. అయితే కోచ్ పదవిని అతడు అంగీకరిస్తాడా? లేదా? అనేది కీలకం. తనకు ఇష్టమైన క్రికెట్ కోసం ఇప్పటికే రాజకీయాలను కూడా పక్కన పెట్టేశాడు. కాబట్టి అతడికి తగినంత సమయం ఉంది. ఎందుకంటే టీమిండియా కోచ్‌గా ఎక్కువ టైమ్ వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది’ అని అక్రమ్ అన్నాడు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
Also Read: Janhvi Kapoor: ‘దేవర’లో తన పాత్రను రివీల్ చేసిన జాన్వీ కపూర్!
‘గౌతమ్ గంభీర్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాబట్టి అతడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఏ విషయాన్ని అయినా స్పష్టంగా వెల్లడించే తెలివైన వ్యక్తి గంభీర్. దేని గురించీ రెండు రకాల మాటలు చెప్పడు. ఎక్కడ పొరపాటు జరిగినా.. మొహం మీదే చెప్పేస్తాడు. ఆ లక్షణాల కారణంగానే అతడిని చాలా మంది అభిమానిస్తున్నారు. గంభీర్ మాటల్లో దూకుడు కనిపిస్తోంది. ఒకవేళ భారత జట్టు కోచ్‌గా వస్తే జట్టులోకి దానిని తీసుకొస్తాడనంలో ఎలాంటి సందేహం లేదు’ అని వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో కోల్‌కతాకు మెంటార్‌గా ఉన్నాడు. అతడి మార్గనిర్ధేశంలో కోల్‌కతా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!