Off The Record : అనిల్ కుమార్ పై సీఎం జగన్ కు ఫిర్యాదులు వెళ్లాయా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోయినవాళ్ళు పోగా… మిగిలిన వాళ్ళలో కూడా ఐక్యత లేదా? పరస్పర విభేదాలతో నెల్లూరు వైసీపీలో వార్ పెద్దదవుతోందా? మంత్రి, మాజీ మంత్రి మధ్య యుద్ధం జిల్లా పార్టీని ఎటుతీసుకువెళ్తోంది? సీఎం జగన్‌కు ఫిర్యాదులు వెళ్ళినా…ఎవరూ ఎందుకు తగ్గడం లేదు? అసలు సింహపురి వైసీపీలో ఏం జగురుతోంది?
నెల్లూరు జిల్లా వైసీపీ నేతల మధ్య విభేదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఈ టైంలో మిగతా నేతల మధ్య ఐక్యత పెరగాల్సింది పోయి… కలహాలు మరింత ఎక్కువ అయ్యాయట. ప్రధానంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వ్యవహార శైలిపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిర్వహించే సమావేశాలకు అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావడంలేదట. అటు అనిల్‌కు బాబాయ్ వరుసయ్యే రూప్ కుమార్ యాదవ్ ఆయనతో విభేదించి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా ఆయన సొంతంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలిపై మంత్రి కాకాణి..ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి…జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారట.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల పార్టీకి దూరమయ్యారు. అదే టైంలో పార్టీ కీలక నాయకుల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి. రూరల్ పరిధిలోని అల్లిపురం దగ్గర అనిల్ అనుచరుడు లే ఔట్ వేశారు. నీటిపారుదల శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించి అందులో కలిపేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనిల్ మద్దతిస్తున్నారన్నది లోకల్ టాక్. నెల్లూరు రూరల్ పరిధిలోనే ఉన్న కొత్తూరు అంబాపురం వద్ద ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. ఆ విషయంలో అనిల్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని దళిత సంఘాలు విమర్శిస్తున్నాయి. రూరల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో సంప్రదించకుండానే అన్ని వ్యవహారాల్లో అనిల్ జోక్యం చేసుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆదాల మంత్రి కాకాణి దృష్టికి తీసుకెళ్ళారట.
మరోవైపు…ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మంత్రి కాకాణి సమావేశమయ్యారు. అదే సమయంలో హైదరాబాదులో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని హుటాహుటిన నెల్లూరు పిలిపించారట. ఆ సమావేశంలో అనిల్ కుమార్ వ్యవహార శైలిపైనే ప్రధాన చర్చ జరిగిందట. సమన్వయం కోసం సీఎం జగన్ త్వరలోనే జిల్లా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించ బోతున్నారట. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో కీలకమైన జిల్లాలో ఈ పరిస్థితి ఏంటని వైసీపీ అగ్రనాయకత్వం కూడా ఆగ్రహంతో ఉందట. నేతలు కలిసికట్టుగా పనిచేయకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది గనుక జరగబోయే సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. జగన్‌తో మీటింగ్ తర్వాతైనా… నెల్లూరు నేతల మధ్య విభేదాలు తొలగుతాయో లేదో చూడాల్సిందే.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!