యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ లో స్పై యాక్షన్ మూవీ వార్ 2. హృతిక్, ఎన్టీఆర్, కియారా కాంబో లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మరో భారీ మల్టీస్టారర్ కావడం, వార్ పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కావడంతో ఈ సినిమాపైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు జూనియర్ ఫ్యాన్స్. బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
అయితే వార్ 2 కు టాలీవుడ్ లో ఊహించినంత హైప్ రావట్లేదు. టీజర్ సోసో అనిపించగా ట్రైలర్ ఓకే అనిపించింది. మరి ప్రమోషన్స్ చేయకుంటే బాగోదు అనుకున్నారేమో ఏమో ఎన్టీఆర్ vs హృతిక్ అని సోషల్ మీడియాలో ప్రమోషస్న్ స్టార్ట్ చేసారు. ఎన్టీఆర్ ఇంటి ముందు ఓ వెహికల్ పై వార్ 2 పోస్టర్ తో నాటు నాటుతో మీకు కావాల్సినంత ఇస్తాను కానీ ఈ సారి వార్ నేను గెలుస్తాను అని చేస్తున్న ప్రమోషన్స్ పై నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇవెక్కడి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్స్ అని యష్ రాజ్ ఫిల్మ్ ను టాగ్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఒకటి మాత్రం వాస్తవం ఈ సినిమాకు సౌత్ లో టికెట్ కొన్నారు అంటే అది కేవలం ఎన్టీఆర్ పేరు వలన మాత్రమే. మరి అలాంటిది సౌత్ ప్రమోషన్స్ ను పక్కన పెట్టి కాలయాపన చేస్తున్నారు మేకర్స్. ఇంకా రిలీజ్ కు ఏడు రోజులు మాత్రమే ఉన్నాయి. మరి యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పటికైనా మేల్కొంటారో లేదో.