రైతులు వ్యవసాయంతో పాటుగా అనేక రంగాల్లో రానిస్తున్నారు.. అందులో కోళ్ల పరిశ్రమ. కోళ్ళ పెంపకం అనేది నేడు లాభదాయకమైన వ్యాపారంగా అందరికి మారింది.. యువకులకు, నిరుద్యోగులకు ఈ పెంపకం లాభసాటిగా మారింది. ఒకప్పుడు గ్రామాల్లో ఉండే చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు ఈకోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధిగా మార్చుకునేవారు. అయితే ప్రస్తుతం కోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగడంతో నేడు ప్రత్యేక కుటీర పరిశ్రమగా మారింది. నాటి నుంచి నేటి వరకు పెంపకందారులకు రోజువారీ ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు కోళ్ళ పెంపకం.
ప్రసుత్త కాలంలో పెరిగిన డిమాండ్ కారణంగా పెంపకం సంతరించుకుంది.. ఇకపోతే ప్రభుత్వం అనేక విధాలుగా రాయితీలను కల్పిస్తున్నారు.. ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో సొంతంగా కోళ్ల ఫారం పెట్టుకునే వారికి ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిలో మీరు సగం కడితే చాలు. మిగిలిన అమౌంట్ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. కేంద్ర పశు సంవర్థక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా మాంసం, పాలు, గుడ్లు ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాయితీని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు రెండు విడతలుగా చెల్లిస్తుంది.. దాంతో రోజూ రోజుకు ఈ కోళ్ల పెంపకం పెరిగిపోతుంది..
రైతులకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు.. పలు కంపెనీలు, ఇలా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని జాతీయ బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. దీని కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పోర్టల్ నిర్వహిస్తోంది.. ఈ రుణాన్ని ఎలావర్క్ పొందాలంటే.. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ పోర్ట ల్‌కు వెళ్లి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. దీని కోసం https://nlm.udyamimitra.in/Login/Login పోర్ట ల్‌కు వెళ్లాలి..
ఇదిలా ఉండగా.. ఈ ఫారం పెట్టాలనుకునెవారికి ఆసక్తి మాత్రమే ఉంటే సరిపోదు అందుకు సంబందించిన అర్హతలు కూడా ఉండాలి అని నిపుణులు చెబుతున్నారు.. అవే అర్హతలు కూడా ఉండాలని చెబుతున్నారు.. ఈ ఫారం కనీసం ఒక ఎకరం భూమి అయినా ఉండాలి. దానికి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాలి. సొంత భూమి లేని వారు కౌలుకు తీసుకున్న భూమిపై కూడా రుణం పొందవచ్చు. కోళ్ల ఫారానికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసుకుని, దాన్ని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అధికారులకు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలి. మీరు రుణం తీసుకోవాలంటే సిబిల్ స్కోరు కూడా బలంగా ఉండేలా చూసుకోండి.అంతేకాకుండా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఉండాలి. ఆధార్ కార్డు, కోళ్ల ఫారం ఏర్పాటు చేయదలచుకున్న భూమి ఫొటో, భూమికి సంబంధించిన పత్రాలు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, మొదలగునవి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. చివరగా మీ సంతకం కూడా చేసి స్కాన్ చెయ్యాలి.. అప్పుడే ప్రభుత్వం లోన్ ఇస్తుంది.. మీకు ఈ ఆలోచన ఉంటే కానివ్వండి..