Waker uz Zaman: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసినట్లు తాజాగా బంగ్లాదేశ్ దేశ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం దేశంలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలైనంతగా త్వరగా పనులు జరుగుతున్నయని పేర్కొన్నారు. దేశంలో ఈ సందర్బంగా మధ్యంతర ప్రభుత్వం పాలన చేపట్టనుందని., తాను దేశంలోని రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడానని, అలాగే శాంతిభద్రతల బాధ్యతను సైన్యం తన చేతిలోకి తీసుకుంటుందని ఆర్మీ చీఫ్ చెప్పారు.
Collectors Conference: 11 గంటల పాటు సాగిన కలెక్టర్ల సదస్సు.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం
ఇక అతిత్వరలో దేశంలో శాంతిని నెలకొల్పుతామని., హింసను ఆపాలని తాము పౌరులను కోరుతునాట్లు ఆయన చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా జరిగిన అన్ని హత్యలను తాము విచారించబోతున్నామని., దాంతో ఇప్పుడు దేశంలో ఎటువంటి కర్ఫ్యూ లేదా ఎమర్జెన్సీ అవసరం లేదని ఆయన అన్నారు. నేటి రాత్రికి దేశంలోని సంక్షోభానికి పరిష్కారం కనుగొంటాం అంటూ ఆయన తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులందరు ప్రశాంతంగా ఉండి వారి ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరారు.
Amaravathi: రెవెన్యూ శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
ఇక మరోవైపు దేశ ప్రధాని హసీనా అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు ప్రవేశించి రణరంగం సృష్టించారు. గడిచిన 2 రోజుల నుంచి ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ఏకంగా 106మందికి పైగా మరణించారు. దేశంలో వివాదాస్పద రిజర్వేషన్ వ్యవస్థపై హసీనా ప్రభుత్వంపై విస్తృత నిరసనలు రావడంతో ప్రధానమంత్రి తప్పక పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని సమాచారం.