NTV Telugu Site icon

Amit Shah: తెలంగాణలో ఓటు షేర్ పెరిగింది.. 10 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నాం

Amit Sha

Amit Sha

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బీజేపీ నిర్వహించిన సభలో హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్ నినాదాలతో ప్రజల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో ఓటు షేర్ పెరిగిందని.. 10 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థలో స్థానంలో నిలపడమే ఎన్డీఏ లక్ష్యమని అన్నారు. సీఎంగా, ప్రధాన మంత్రిగా ఒక్క అవినీతి మరక కూడా లేని వ్యక్తి నరేంద్ర మోడీ అని కొనియాడారు. ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసే వ్యక్తి నరేంద్రమోడీ అని ప్రశంసించారు. సెలవులు కోసమని విదేశాలకు వెళ్లే వ్యక్తి రాహుల్ గాంధీ అని దుయ్యబట్టారు.

Ap Weather: ఏపీ ప్రజలకు చల్లటి కబురు.. రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు

నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు… 70 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్, అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టలేదని అమిత్ షా తెలిపారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాకనే రామందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగిందని అన్నారు. అంతేకాకుండా.. నరేంద్ర మోడీ దేశంలో తీవ్రవాదం లేకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో అనేక తీవ్రవాద దాడులు జరిగాయి… మోడీ ప్రభుత్వం వచ్చాక దాడులు జరిగిన వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని చెప్పారు.

AM Rathnam: హరిహర వీరమల్లు నిర్మాతకు జనసేనలో కీలక పదవి

తెలంగాణ ముఖ్యమంత్రి తన ఫేక్ వీడియోలు షేర్ చేసి అబద్దాలు ప్రచారం చేశారని అమిత్ షా దుయ్యబట్టారు. ఇంతకు ముందు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే, ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి చేస్తుందని ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు అవసరమా.. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేసి ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ అంటుందని తెలిపారు. తెలంగాణ విమోచన దినం జరుపుకోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని కోరారు. గోడం నగేష్ కు వేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీకి వేసేదేనని అమిత్ షా తెలిపారు.