సోషల్ మీడియాలో రకరకాల వంటల వీడియోలు దర్శనమిస్తుంటాయి.. అందులో కొన్ని కాంబినేషన్స్ తల నొప్పి తెప్పిస్తే.. మరికొన్ని వీడియో జనాలకు భయాన్ని కలిగిస్తున్నాయి.. అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో పరోటాలను తయారు చేసిన తీరు జనాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై ఒక లుక్ వేద్దాం పదండీ..
ఈ ఏడాదిలోనూ ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ తాజాగా వోడ్కా ఆలూ పరాఠా హాట్ టాపిక్ గా మారింది. అయితే తాము ఇష్టంగా తినే ఆలూ పరాఠాని వోడ్కాతో తయారు చేయడం ఏంటని చాలా మంది తిట్టిపోస్తున్నారు. వోడ్కా కలిపితే పరాఠా టేస్ట్ ఎంత దారుణంగా మారుతుందో ఊహించడానికే కష్టంగా ఉందని మరికొందరు మండి పడుతున్నారు.. ఈ పరోటాను ఓ ఇంస్టాగ్రామ్ యూజర్ తయారు చేసింది.. ఆ వీడియోనే ఇది.. ఆమె నూనెకు బదులుగా వోడ్కాని ఎలా వాడుతుందో మనం చూడవచ్చు. ఆమె పిండిని మెత్తగా చేయడానికి, మసాలా బంగాళాదుంపను స్టఫ్ గా వాడింది. తడి చేయడానికి, పాన్ మీద పరాఠాను వేయించడానికి వోడ్కాను ఉపయోగించింది..
ఆ తర్వాత ఆమె పరాఠాను కొద్దిగా తిని దాని టేస్ట్ ఎలా ఉందో వివరించింది. ఆమె మాట్లాడుతూ ఆ పరాఠా స్పైసీగా, హాట్ గా ఉందని, తల తిరుగుతుందని చెప్పింది.. కొత్తగా, మత్తుగా ఉందని పేర్కొంది.. ఆహారం, పానీయాలు రెండింటినీ ఆస్వాదించడానికి ఇది మంచి మార్గం అని కూడా ఆమె పేర్కొంది.. ఆ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది క్షణాలకే వ్యూస్ అధికంగా వచ్చాయి.. అంతే విధంగా కామెంట్స్ కూడా అందుకుంది.. ఏంటో ఈ ఖర్మ ఒక లుక్ వేసుకోండి మరి..