Vizag Hotels: విశాఖ హోటల్స్‌కు తాకిన యుద్ధ ప్రభావం.. మరో రెండు రోజుల్లో అన్నీ క్లోజ్!
- ముడి చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం
- విశాఖ హోటల్స్‌కు తాకిన యుద్ధ ప్రభావం
- ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు క్లోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Hotels Face Closure Threat as Commercial LPG Shortage: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్‌లో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో సమస్యలు తలెత్తడంతో పలు రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యుద్ధ ప్రభావం ఇప్పుడు పర్యాటక నగరం విశాఖపట్నంలోని హోటల్ రంగానికీ తాకింది.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడినట్లు హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు రోజుల్లో విశాఖలో కూడా హోటళ్లు స్వచ్ఛందంగా మూతపడే పరిస్థితి రావచ్చని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖ నగరంలో గత వారం రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని హోటల్ యజమానులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు ఒక కమర్షియల్ సిలిండర్ ధర సుమారు రూ.1300 ఉండగా.. ప్రస్తుతం అది రూ.1700 దాటింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే రూ.3000 వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Also Read
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
- iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
- Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
- 80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
విశాఖ నగరంలో చిన్నా పెద్దా కలిపి సుమారు 1000 హోటళ్లు ఉన్నాయి. వీటికి ప్రతి నెలా దాదాపు 65 వేల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం కేవలం 45 వేల సిలిండర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో కేవలం 12 నుంచి 14 వేల సిలిండర్లను మాత్రమే సరఫరా చేయగలమని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రోజుకు మూడు షిఫ్టులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరా జరిగేదని, కానీ ఇప్పుడు మూడు రోజులకు ఒకసారి మాత్రమే సరఫరా జరుగుతోందని హోటల్ యజమానులు తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటళ్లను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని హోటల్స్ అసోసియేషన్ కోరుతోంది. గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకువచ్చి హోటల్ రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
తాజావార్తలు
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
ట్రెండింగ్
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!