Vivo V40e Price: ఏఐ ఫీచర్లతో వివో వి40ఈ.. 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ!
- ఏఐ ఫీచర్లతో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్
- ఆకర్షణీయమైన డిజైన్‌తో లాంచ్
- 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo V40e 5G Smartphone Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వివో’ ఏఐ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వీ సిరీస్‌లో భాగంగా ‘వివో వీ40ఈ’ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. వివో వీ40, వివో వీ40 ప్రోకు మంచి ఆదరణ దక్కడంతో వివో వీ40ఈను లాంచ్ చేసింది. వెట్ టచ్ ఫీచర్‌తో వస్తున్న ఈ ఫోన్లో 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఆకర్షణీయమైన డిజైన్‌తో లాంచ్ అయిన వివో వీ40ఈ ధర, ఫీచర్స్ వివరాలను ఓసారి చూద్దాం.
వివో వీ40ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.28,999గా.. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.30,999గా కంపెనీ నిర్ణయించింది. మింట్గ్రీన్, రాయల్ బ్రాంజ్ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 2 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. వివో ఇ- స్టోర్, వివో ప్రధాన స్టోర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ మొబైల్ కొనుగోలు చేయొచ్చు. ఆన్లైన్లో కొనుగోలు చేసేవారికి 6 నెలల నో- కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
Also Read: Virat Kohli: కోహ్లీ జోరు తగ్గింది.. సచిన్ రికార్డులు అధిగమించడం కష్టమే!
వివో వీ40ఈలో 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేటు, 4 ఎన్ఎం మీడియాటెక్ డైమన్సిటీ 7300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్14తో ఇది వస్తోంది. ఐఓఎస్‌కు సపోర్ట్ చేసే 50 ఎంపీ సోనీ IMX882 ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కోసం 50ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఏఐ ఎరేజర్, ఏఐ ఫొటో ఎన్హాన్సర్ ఫీచర్లు ఉన్నాయి. 5500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 80 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!