7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo T5x 5G Fusion Red: వివో (vivo) ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసిన వివో టి5ఎక్స్ 5జి (vivo T5x 5G) స్మార్ట్‌ఫోన్‌కు కొత్తగా ఫ్యూజన్ రెడ్ (Fusion Red) కలర్ వేరియంట్‌ను జత చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ స్టార్ సిల్వర్ (Star Silver), సైబర్ గ్రీన్ (Cyber Green) రంగుల్లో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఫ్యూజన్ రెడ్ రంగుతో మరోసారి వినియోగదారులకు అందించింది. కొత్త కలర్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్ తోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో 6.76 అంగుళాల Full HD+ (2408×1080 పిక్సెల్స్) డిస్ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీంతో వీడియోలు, గేమింగ్, స్క్రోలింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4nm MediaTek Dimensity 7400 Turbo ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను అమర్చారు. దీనికి Mali-G615 MC2 GPU జత కావడంతో గేమింగ్, మల్టీటాస్కింగ్ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది. ఫోన్ 6GB, 8GB LPDDR4X RAMతో పాటు 128GB, 256GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది.
Also Read
- HMD Asha 305: HMD Asha 305 విడుదల.. 2GB RAM, 16GB స్టోరేజ్, 4Gతో చౌకైన స్మార్ట్‌ఫోన్
- Colorful RimBook L1 Plus: AMD రైజెన్ 7 7735HS ప్రాసెసర్‌తో.. కలర్ ఫుల్ రిమ్బుక్ L1 ప్లస్ ల్యాప్‌టాప్ విడుదల
- Honor X6e: హానర్ X6e రిలీజ్.. 7,500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్
- Humanoid Robot: రూ.3,000 ఇస్తే చాలు... మీ ఇంట్లోని చెత్తంతా ఎత్తి పడేస్తుంది..
ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50MP సోనీ IMX852 ప్రధాన కెమెరాను అందించారు. దీనికి 2MP డెప్త్ సెన్సార్ తోడుగా ఉంటుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ముందు, వెనుక కెమెరాలు రెండూ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేయగలవు. అలాగే ఇది 7,200mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీను అందించారు. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, USB Type-C ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌తో వస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, USB Type-C వంటి ఆధునిక ఫీచర్లను అందించారు
vivo T5x 5G 6GB + 128GB వేరియంట్ ధర రూ.24,999, 8GB + 128GB మోడల్ ధర రూ.27,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.30,999గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్లలో భాగంగా యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, SBI క్రెడిట్ కార్డులపై రూ.2,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే 6 నెలల వరకు No-Cost EMI సదుపాయం కూడా అందిస్తున్నారు.
తాజావార్తలు
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Khalifa: ‘ఖలీఫా’ నుంచి బిగ్ అప్డేట్.. మోహన్‌లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
-
Mohammed Shami: మరో పిడుగులాంటి వార్త.. ఇక మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్!
-
Explainer: చట్టం పోలీసులకు చుట్టమా? శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అమాయకులు ఎలా బలైపోతున్నారు?
-
Cyberabad Police: కాసేపట్లో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులు, ప్రజలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?