కమెడియన్ వైవా హర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబర్ గా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్ ల ద్వారా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.వైవా హర్ష ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు.అయితే తాజాగా వైవా హర్ష నూతన గృహప్రవేశం చేసారు.. ఈ క్రమంలోనే ఈయన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ గృహప్రవేశ కార్యక్రమానికి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అతిధి గా హాజరు అయ్యారు. దీనితో నెటిజన్స్ వైవా హర్ష కు సోషల్ మీడియా వేదిక గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.వైవా హర్ష రీసెంట్ గా వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.
కరోనా సమయం లో అతి కొద్ధి మంది బంధువుల సమక్షం లో తన పెళ్లి వేడుకలను చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఇక ఈయన కెరియర్ విషయానికి వస్తే యూట్యూబ్ వీడియోలతో కెరీర్ మొదలు పెట్టిన వైవా హర్ష తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. సినిమాలలో కూడా అదే స్థాయి కామెడీ తో ఎంతో సందడి చేస్తున్నారు.తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కమెడియన్ గా నటించి మెప్పించాడు.సుహాస్ హీరో గా నటించిన కలర్ ఫోటో, ఆనంద్ దేవరకొండ హీరో గా నటించిన బేబీ సినిమాలలో హర్ష నటన అందరిని ఎంతగానో అలరించింది. వైవా హర్ష కు మెగా హీరో సాయి ధరంతేజ్ మంచి స్నేహితుడు. వీరి మధ్య ఉన్న స్నేహబంధం కారణంగానే సాయి ధరంతేజ్ హర్ష గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొని ఎంతో సందడి చేశారు. ప్రస్తుతం వైవా హర్ష కు కమెడియన్ గా మంచి ఛాన్స్ లు వస్తున్నాయి.అలాగే ఈయన ప్రస్తుతం సోలో హీరో గా సుందరం మాస్టర్ అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమాను మాస్ మహారాజ్ రవితేజ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా వైవా హర్షకు ఎలాంటి గుర్తింపు తెస్తుందో చూడాలి.